వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో దేవాలయం కట్టాలి, లేదంటే మీ కథ క్లోజ్, బీజేపీ మంత్రి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ దేవాలయం ఉండే విదంగా చర్యలు తీసుకోవాలని, రోగికి చికిత్సతో పాటు దైవశక్తి, దైవభక్తి (పాసిటివ్ ఎనర్జీ ) ఎంతో అవసరం అని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో ఆలయాలు నిర్మించే విషయంలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మీ కథ క్లోజ్ అని మంత్రి బళ్లారి శ్రీరాములు అధికారులను హెచ్చరించారు. ప్రతి రోగికి చికిత్సతో పాటు ధ్యానం గురించి అవగాహన కల్పించాలని ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు పై విదంగా సూచించారు.

గాలి జనార్దన్ రెడ్డికి ఎదురు దెబ్బ, అక్రమ మైనింగ్, సీబీఐ విచారణకు గ్నీన్ సిగ్నల్!గాలి జనార్దన్ రెడ్డికి ఎదురు దెబ్బ, అక్రమ మైనింగ్, సీబీఐ విచారణకు గ్నీన్ సిగ్నల్!

హిందూ, ముస్లీం, క్రిస్టియన్, జైన్

హిందూ, ముస్లీం, క్రిస్టియన్, జైన్

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో దేవాలయం నిర్మించండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో హిందూ, ముస్లీం, క్రిస్టియన్, జైన్ అనే తేడా ఉండకూడదు. ఏ మతానికి చెందిన ఆలయం అయినా సరే ఒక ఆలయం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేస్తే రోగుల్లో ధైర్యం పెరిగి పాసిటివ్ ఎనర్జీ వస్తుందని, త్వరగా వారు కోలుకోవడానికి అవకాశం ఉంటుందని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నాయి కదా!

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నాయి కదా!

ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో ఓ చిన్న దేవాలయం ఉందని మంత్రి బళ్లారి శ్రీరాములు గుర్తు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆలయాలు లేకున్నా దేవుడి విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఆ పని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు చెయ్యలేదని మంత్రి బళ్లారి శ్రీరాములు అధికారులను ప్రశ్నించారు. ప్రతి జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ఈ విషయంపై ప్రత్యేక దృష్టిసారించాలని, వీలైనంత త్వరగా దేవాలయాలు నిర్మించాలని మంత్రి బళ్లారి శ్రీరాములు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నిధుల కొరత లేదు!

నిధుల కొరత లేదు!

ఆరోగ్య శాఖలో నిధుల కొరత లేదని మంత్రి బళ్లారి శ్రీరాములు చెప్పారు. అయితే నిధులు సద్వినియోగం చేసుకోవడంలో అధికారుల్లో సరైన అవగాహన లేదని, నిధులు సద్వినియోగం చేసుకోవడంలో దక్షిణ కన్నడ జిల్లా టాప్ లో ఉందని మంత్రి బళ్లారి శ్రీరాములు చెప్పారు. డిసెంబర్ నెలలోపు అన్ని జిల్లాల్లో 90 శాతం నిధులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి బళ్లారి శ్రీరాములు అధికారులకు సూచించారు.

మాడ్రన్ కేంద్రాలు

మాడ్రన్ కేంద్రాలు

ప్రతి జిల్లాలో ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించి వాటిని మాడ్రన్ సముదాయ కేంద్రాలుగా నిర్మించాలని అధికారులకు మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు. ప్రతి జిల్లాలో మాడ్రన్ సుముదాయ కేంద్రాలు పరిశీలించి ఉత్తమ పనితీరు కనబరిచిన మొదటి రెండు ఆసుపత్రులకు రూ. 3 లక్షల చెప్పున, తరువాత రెండు ఆసుపత్రులకు రూ. 1 లక్ష చెప్పున బహుమానం అందించి ప్రోత్సహిస్తామని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం!

కఠిన చర్యలు తీసుకుంటాం!

ఆరోగ్య శాఖలో తన సూచనలు, సలహాలను సరైన సమయంలో పాటించకుండా నిర్లక్షం చేసే అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బళ్లారి శ్రీరాములు హెచ్చరించారు. ఆరోగ్య శాఖ అధికారుల మీద కర్ణాటక ప్రైవేటు వైద్య సంస్థ (కేపీఎంఇ) చట్టం కింద చర్యలు తీసుకుంటామని, ఆ అవకాశం రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు.

English summary
Karnataka health minister Sri B Ramulu Instructed officers to build small temples in every government hospitals in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X