వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థానేలో కూలిన భవనం: 9 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 15 మంది చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు.

థానే పాతనగరంలోని నౌపడ ప్రాంతంలో గల బి కేబిన్‌లోని మంగళవారం తెల్లవారు జామున గం.2.45 నిమిషాల ప్రాంతంలో భవనం కూలింది. భవనం ప్రమాదకరంగా మారిందని, ఎవరూ ఉండకూడదని గతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా అందులో కొంత మంది ఉంటూ వచ్చారు.

 Building collapses in Thane; 9 dead, 7 injured

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ సంజీవ్ జైశ్వాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ యంత్రాలతో సహాయక బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు ఎన్‌డిఆర్ఎఫ్ బృందం శునకాలతో, తగిన పరికరాలతో భవనం చెంతకు చేరుకుంది.

English summary
At least nine people were killed and seven injured after a three-storey building collapsed at B Cabin area in Naupada in the old Thane city on Tuesday. The incident occurred at 2.45 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X