• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆనాడు ఎడ్లబండి..నేడు లాంచ్ ప్యాడ్: ఫోటోలు పెట్టి మరీ ఇస్రోకు నెటిజెన్ల ప్రశంసలు

|

అంతరిక్షరంగంలో భారత్ మరో రికార్డు సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవంపై చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టడీ చేసేందుకు ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2ను పంపింది. ప్రయోగం విజయవంతం అయ్యింది. 10 ఏళ్ల క్రితం చంద్రయాన్-1 విజయం తర్వాత చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-2కు శ్రీకారం చుట్టి విజయం సాధించింది ఇస్రో. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో నెటిజెన్లు ఇస్రోపై ప్రశంసల వర్షం కురిపిస్తూ దేశ అంతరిక్ష చరిత్రలో చోటుచేసుకున్న సందర్భాలను ట్వీట్ చేశారు. ఇస్రో ఆవిర్భావం నుంచి తొలి రాకెట్ ప్రయోగించిన నాటి ఫోటోలను ట్వీట్ చేశారు.

తొలినాళ్లలో ఎద్దుల బండిపై శాటిలైట్

భారత్ ప్రయోగించిన తొలి సమాచార ఉపగ్రహం "యాపిల్"కు సంబంధించిన ఫోటోను ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ట్విటర్‌లో పోస్టు చేస్తూ.... ఎద్దుల బండి నుంచి చంద్రుడి వరకు అనే క్యాప్షన్‌ను రాశారు. 1981లో ఓ ఎద్దుల బండి శాటిలైట్‌ను మోసుకెళ్లే దృశ్యాలను పోస్టు చేశారు. తొలి ఉపగ్రహంను ఓ ఎద్దుల బండిపై నుంచి పంపారని ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్వీ, క్రయో ఇంజిన్లు మామ్, తాజాగా మూన్‌లాండర్ వరకు ఇస్రో ప్రయాణం సాగిందని రాశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో అగ్రదేశాల సరసన భారత్‌ను నిలబెట్టినందుకు ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం అని రాశారు.

  చంద్రయాన్ -2 ప్రయోగాని ప్రత్యక్షంగా చూడవచ్చు
   1963లో రాకెట్ విడిభాగాన్ని సైకిల్‌పై మోసుకెళుతున్న ఉద్యోగి

  1963లో రాకెట్ విడిభాగాన్ని సైకిల్‌పై మోసుకెళుతున్న ఉద్యోగి

  ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ ఈ ఫోటోను పోస్టు చేయగానే నెటిజెన్లు కూడా ఆనాటి పాత ఫోటోలను పోస్టు చేసి ఇస్రోకు అభినందనలు తెలిపారు. అంతకుముందు అంటే 1963లో రాకెట్ విడిభాగాన్ని సైకిల్ పై మోసుకెళుతున్న వ్యక్తి ఫోటోను ట్వీట్ చేశారు.

  ల్యాబులో ఆర్యభట్ట ఉపగ్రహం

  ల్యాబులో ఆర్యభట్ట ఉపగ్రహం

  1975లో ప్రయోగించిన తొలి భారత ఉపగ్రహం ఆర్యభట్టకు సంబంధించి ల్యాబ్‌లో తయారు చేస్తున్న ఫోటోలను నెటిజెన్లు పోస్టు చేశారు. అయితే ఈ ఉపగ్రహంను రష్యా లాంచ్ సైట్ నుంచి భారత్ ప్రయోగించింది.1972లో రష్యా భారత్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరాక భారత్ ఆర్యభట్ట ప్రయోగంను విజయవంతంగా నిర్వహించింది. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్టను విజయవంతంగా ప్రయోగించారు. నిర్దిష్ట కక్ష్యలోకి ఉపగ్రహం చేరేందుకు నాలుగు రోజుల సమయం పట్టింది. 1992 ఫిబ్రవరి 10 వరకు ఆర్యభట్ట సేవలందించింది.

  వెహికల్స్ కాలక్రమంలో లాంచ్ వెహికల్స్

  వెహికల్స్ కాలక్రమంలో లాంచ్ వెహికల్స్

  ఆ తర్వాత కాలక్రమంలో ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్ల వివరాలు తెలుపుతూ మరొకరు ఆ ఫోటోలను పోస్టు చేశారు. అందులో ఆ లాంచ్ వెహికల్స్‌కు సంబంధించిన సమాచారంను కూడా ఇచ్చారు.

   నెహ్రూను విమర్శిస్తూ నాటి ఫోటోలు ట్వీట్

  నెహ్రూను విమర్శిస్తూ నాటి ఫోటోలు ట్వీట్

  మరి కొందరు నెటిజెన్లు నాటి నెహ్రూ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో లండన్ ఒలంపిక్స్‌కు భారత ఫుట్‌బాల్ జట్టు వెళ్లగా ఆటగాళ్లకు కనీసం బూట్లు లేని పరిస్థితి అని ... కానీ దేశ తొలి ప్రధాని మాత్రం ఆయన పెంపుడు కుక్కను ఏకంగా విమానంలో తిప్పారని మరో నెటిజెన్ ఫోటోతో కూడిన ట్వీట్ పోస్టు చేశాడు.

  సైకిల్ పై రాకెట్ విడిభాగం... జెట్‌లో రాహుల్ బర్త్‌డే వేడుకలు

  ఇదిలా ఉంటే ఇందిరా గాంధీ తన మనవడు రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలను ప్రైవేట్ జెట్‌లో జరిపిన ఫోటోను పోస్టు చేశాడు. పక్కనే సైకిల్‌పై రాకెట్ విడిభాగాలను మోసుకెళుతున్న ఇస్రో ఉద్యోగుల ఫోటోను పెట్టాడు.

  మొత్తానికి చంద్రయాన్ -2 విజయం సాధించడంపై అభినందనలు తెలుపుతూనే ఆనాటి నుంచి ఈ నాటి వరకు భారత అంతరిక్ష రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను ఫోటోలతో షేర్ చేసి తమ అనుభవాలను పంచుకున్నారు నెటిజెన్లు.

  English summary
  ISRO just marked another proud moment in history as it launch its second mission to Moon, Chandrayaan-2 today on July 22, 2019.As India basked in the glory of this proud moment, Indian Twitter took to social media to praise the space organisation’s efforts. While many called it a proud moment, others relived earlier space missions that were conducted by India through vintage pictures.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more