• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bumper offer: నక్కతోక తొక్కిన కర్ణాటక, నలుగురు మంత్రులు, మోదీ ఆశీర్వాదం, చాన్స్ అంటే ఇదే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కర్ణాటకకు బంపర్ ఆఫర్ తగిలింది. కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో కర్ణాటకకు చెందిన నలుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శోభా కరందాజ్లేతో పాటు సీనియర్ పాత్రికేయుడు రాజీవ్ చంద్రశేఖర్, ఏ. నారాయణస్వామి, భగవంత ఖూబాకు మోదీ ఆయన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం డీవీ. సదానందగౌడకు బదులుగా అదే రాష్ట్రానికి చెందిన నలుగురికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుల లెక్కలు తారుమారు అయ్యాయి. మొత్తం మీద కర్ణాటకకు నక్కతోక తొక్కినట్లు అయ్యింది.

Illegal affair: భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త, కసక్ అని పొడిచేసిన ప్రియుడు. క్లైమాక్స్ !Illegal affair: భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త, కసక్ అని పొడిచేసిన ప్రియుడు. క్లైమాక్స్ !

సీఎం వర్గం ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్

సీఎం వర్గం ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్

కర్ణాటకలోని చిక్కమగళూరు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ అయిన శోభా కరందాజ్లే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మోదీ మంత్రివర్గంలో శోభా కరందాజ్లేకి చోటు దక్కింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం ప్రారంభించిన శోభా కరందాజ్లే పక్కా హిందుత్వవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రిగా, బీజేపీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన శోభా కరందాజ్లే కర్ణాటక బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

సీనియర్ జర్నలిస్టు రాజీవ్ చంద్రశేఖర్

సీనియర్ జర్నలిస్టు రాజీవ్ చంద్రశేఖర్

భారతదేశంలో సీనియర్ జర్నలిస్టుగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని మూడుసార్లు వరుసగా రాజ్యసభ నభ్యుడిగా అనుభవం ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ కు మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. కన్నడలోని సువర్ణ న్యూస్, కన్నడప్రభ, రిపబ్లిక్ టీవీ, బీపీఎల్ మొబైల్, సెల్యులార్ కంపెనీతో పాటు అనేక వ్యాపారాలు రాజీవ్ చంద్రశేఖర్ నిర్వహిస్తున్నారు. డిజిల్ ఇండియాలో కీలకపాత్ర పోషించిన రాజీవ్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు అందరూ ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. బెంగళూరు సిటీ అభివృద్ది కోసం రాజీవ్ చంద్రశేఖర్ ఆయన శక్తిమేరకు కృషి చేశారు.

 కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు !

కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు !

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ కు చెందిన ఎ. నారాయణస్వామి పక్కా తెలుగు మాట్లాడుతారు. 1996లో ఆనేకల్ పురసభ (మునిసిపాలిటి) కౌన్సిలర్ గా ఎన్నికైన నారాయణస్వామి 1997లో ఎమ్మెల్సీ అయ్యారు. 1999, 2004, 2008లో ఎమ్మెల్యే అయిన నారాయణస్వామి కర్ణాటక మంత్రిగా పని చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో చిత్రదుర్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీ అయిన నారాయణస్వామి ఇప్పుడు మోదీ క్యాబినేట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎస్సీ నాయకుడైన నారాయణస్వామి మునిసిపాలిటి కౌన్సినర్ నుంచి నేడు కేంద్రమంత్రి అయ్యారు.

బీదర్ కు బంపర్ ఆఫర్

బీదర్ కు బంపర్ ఆఫర్


కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని బీదర్ లోక్ సభ ఎంపీ భగవంత ఖూబా గత లోక్ సభ ఎన్నికల్లో 1 లక్షా 25 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. రాజకీయాలతో పాటు వ్యవసాయం చేస్తున్న భగవంతకు చివరి నిమిషం వరకు మంత్రి పదవి దక్కుతుందని ఆయనకే తెలీదు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ కు పరుగు తీసిన భగవంతా ఖూబా ఢిల్లీ చేరుకుని మోదీ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీదర్ చరిత్రలోనే ఇంత వరకు కేంద్ర మంత్రిగా ఎవ్వరూ పని చెయ్యకపోవడంతో ఆ జిల్లాలో మొదటిసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న భగవంత ఖూబా రికార్డు సృష్టించారు. మొత్తం మీద కర్ణాటకకు చెందిన నలుగురు కొత్త మంత్రులు మోదీ మంత్రివర్గంలో చోటు సంపాధించుకోవడంతో కన్నడిగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

IPL 2021 : Billy Stanlake, Reece Topley Rejects Chennai's Offer To Play In IPL 2021 || Oneindia
English summary
Bumper offer: Four MPs from Karnataka will join Prime Minister Narendra Modi's Cabinet 2.0 on Wednesday. Rajya Sabha MP Rajeev Chandrashekhar, Chikkamagaluru MP Shobha Karandlaje, Chitradurga MP A Narayanaswamy and Bidar MP Bhagawanth Khubha to join the Council of Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X