వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాక్ పాట్: రూ.6.5 కోట్లు లాటరీలో గెలుచుకొన్న కేరళ మహిళ

దుబాయ్ లో 28 ఏళ్ళపాటు పనిచేసి వచ్చిన ఓ టీచర్ కు జాక్ పాట్ దక్కింది. ఓ లాటరీలో ఆమెకు ఏకంగా 6.5 కోట్లను గెలుచుకొంది. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఆమె ఈ డబ్బులను గెలుచుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

దుబాయ్: దుబాయ్ లో 28 ఏళ్ళపాటు పనిచేసి వచ్చిన ఓ టీచర్ కు జాక్ పాట్ దక్కింది. ఓ లాటరీలో ఆమెకు ఏకంగా 6.5 కోట్లను గెలుచుకొంది. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఆమె ఈ డబ్బులను గెలుచుకొంది.

కేరళలోని త్రిస్పూర్ నగరానికి చెందిన శాంతి అచ్యుతన్ కుట్టీ.28 ఏళ్ళపాటు దుబాయ్ లో పనిచేసి వచ్చింది. అయితే ఐదేళ్ళ క్రితం ఆమె రిటైరైంది. ఆమె ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత భారత్ కు వచ్చిన ఆమె కుటుంబంతో కలిసి స్వగ్రామంలోనే ఉంటుంది.

Bumper offer to indian lady Shanti acthutan kutti

అయితే ఆమెను అదృష్టం వరించింది. ఇంట్లో టీవి చూస్తుండగా దుబాయ్ నుండి ఓ ఫోన్ కాల్ వచ్చిందామెకు. ఆమెకు లాటరీలో 6.5 కోట్లు వచ్చాయని చెప్పారు. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

భర్తతో కలిసి ఆమె ఏప్రిల్ మాసంలో దుబాయికి వెళ్ళారు. తిరిగి వచ్చే సమయంలో దుబాయ్ డ్యూటీ ప్రీ మిలినియం ప్రమోషన్ డ్రా లో ఓ లాటరీ టిక్కెట్టును ఆమె భర్త కొన్నాడు. ఈ లాటరీకి సంబంధించి బుధవారం నాడు డ్రా తీశారు. అయితే ఈ డ్రాలో ఆమె గెలుపొందినట్టు నిర్వాహకులు పోన్ చేసి చెప్పారు.

ఈ వార్తతో ఆ కుటుంబం సంతోషంగా ఉన్నారు. ఈ డబ్బుతో ఏం చేయాలనేదానిపై ఆ కుటుంబం ప్లాన్ చేస్తోంది.అస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు ఇప్పటికే టూర్ కు వెళ్ళామని , అయితే ఈ సారి అమెరికా వెళ్ళాలనుకొంటున్నట్టు చెప్పారు. 1984 నుండి దుబాయ్ లో నివసించేవాడినని, న్యూఇండియన్ మోడల్ స్కూల్ లో పనిచేసినట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు. దాదాపుగా 28 ఏళ్ళపాటు దుబాయ్ లో పనిచేశానన్నారు. ఉద్యోగంతో పాటు కోటీశ్వరురాలిని చేసిందని ఆమె మురిసిపోతోంది.

English summary
Bumper offer to indian lady Shanti acthutan kutti. She got 6.5 crore lottery prize. Shanti worked as a teacher in Dubai past 28 years. recently she came India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X