వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలువలో పాత రూ. 500, 1000 కరెన్సీ నోట్ల సంచులు

తమిళనాడులోని వానియంబాడి సమీపంలో పాత రూ.500, 1000 కరెన్సీ నోట్లను చించి వేసిన బస్తాలు రోడ్డు పక్కన పడేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని వానియంబాడి సమీపంలో పాత రూ.500, 1000 కరెన్సీ నోట్లను చించి వేసిన బస్తాలు రోడ్డు పక్కన పడేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వేలూరు జిల్లా వానియంబాడిలో ఫర్నీచర్స్, సిమెంట్ రేకులు విక్రయించే దుకాణం ఉంది.

సేలం నుంచి సిమెంట్ రేకులను ఓ లారీలో ఇక్కడికి తీసుకొచ్చారు. వాటిని కిందికి దించే సమయంలో అవి దెబ్బతినకుండా ఉండేందుకు వాటి కింద కొన్ని సంచులను ఉంచారు.

Bundles of shredded banned currency cause flutter

రేకులు దించిన తరువాత ఆ సంచులను ఆ ప్రాంతంలోని రోడ్డు పక్కనున్న కాలువలో పడేశారు. శనివారం ఆ దారిన వెళ్తున్న కొందరు సంచులను పరిశీలనగా చూడగా వాటిలో చించివేసిన రూ.500, 1000 నోట్లు కనిపించాయి.

ఈ విషయాన్ని వానియంబాడి తాలూకా పోలీసులకు తెలుపగా, ఇన్ స్పెక్టర్ కాశీ అక్కడికి చేరుకుని బస్తాల్లో ఉన్న నోట్ల కాగితాలను పరిశీలించారు. చించి వేసిన నోట్ల విలువ పెద్ద మొత్తంలోనే ఉండొచ్చని అంచనా. పాతనోట్లు రద్దు చేసిన నేపథ్యంలో లెక్కలు చూపించలేని వాళ్లెవరో ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

English summary
Chennai: Bundles of shredded demonitised 500 and 1000 rupee currency notes found on a truck that brought cement sheets to a hardware store at Vaniyambadi near Vellore caused a flutter early Saturday and brought a posse of policemen to investigate. Shop owner Syed Aslam was stunned when one of the four large cloth sacks, loaded on the truck to support the cement sheets and prevent their breaking, tore and the shredded currency poured out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X