వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు బ్రేక్ ఫెయిల్ : 9 మంది మృతి

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్ : రెప్పపాటు నిర్లక్ష్యంతో గాలిలో ప్రాణాలు తీస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం కాగా .. అప్పుడు బ్రేకులు ఫెయిలవడం కూడా ఓ రీజన్. వాహనం సరిగా తనిఖీ చేయకపోవడంతో జరిగే ప్రమాదాలతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

bus brake fail, fell down .. 9 dead

తిరిగిరాని లోకాలకు ..
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబాజీలోని త్రిసూలియా ఘాట్ వద్ద ప్రయాణికులతో రోడ్డు రక్తమోడింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు బ్రేకు ఫెయిలంది. దీంతో రాయిని ఢీ కొంది. అంతటితో ఆగకుండా రాయిని ఢీ కొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం వల్లే బస్సు బోల్తా పడిందా ? మరే కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రయాణానికి బయల్దేరినా బస్సు కండీషన్ ను డ్రైవర్ ఎందుకు చూసుకోలేడనే ప్రశ్న తలెత్తింది. ఆ బస్సు యాజమాన్యాన్ని విచారిస్తే నిజనిజాల తెలుస్తాయని పోలీసు అధికారులు అంటున్నారు. మరోవైపు మృతుల వివరాలను అధికారులు గుర్తించాల్సి ఉంది.

భద్రతా చర్యలు తీసుకొని ఉంటే ..
అయితే ఇదే దారిలో గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. మూలమలుపు ఉండటంతో ప్రమాదం జరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని .. సరైన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించినా .. పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికే సరైన జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే మరో 9 మంది చనిపోయి ఉండేవారు కాదని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
There was a serious road accident in Gujarat. The road was blown up by passengers at Trasulia Ghat in Ambaji. The minibus breakaway with the passengers is fair. Then the stone fell. Without stopping, the stone fell off. Nine people died in the accident. Five more people were seriously injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X