వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు-ట్రక్కు ఢీ, 12 మంది వలసకూలీలకు గాయాలు, ఏడుగురి పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

లా‌క్‌డౌన్ పొడగింపులతో.. సొంత ఊర్లకి వెళ్లే వారు ఎక్కువవుతున్నారు. అయితే కొందరు ట్రక్కుల్లో వెళ్తుంటే.. మరికొందరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఔరాయియాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరవకముందే మరో యాక్సిడెంట్ జరిగింది. యూపీలోనే జరిగిన ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది.

షాకింగ్ : నటుడి ఆత్మహత్య.. అద్దె కూడా చెల్లించలేని స్థితిలో.. లాక్ డౌన్ ఎఫెక్ట్.. షాకింగ్ : నటుడి ఆత్మహత్య.. అద్దె కూడా చెల్లించలేని స్థితిలో.. లాక్ డౌన్ ఎఫెక్ట్..

బీహర్‌కి చెందిన వలసకకూలీలు బస్సుల్లో తమ స్వస్థలం భాగాల్‌పూర్ వెళుతున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి వారి బస్సు ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ వద్ద ట్రక్కును ఢీ కొంది. నేషనల్ హైవే-28 వద్ద గల ఫతేవారా పెట్రోల్ పంప్ వద్ద యక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల్లో 25 మంది ఉన్నారు. మిగతా 13 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యాక్సిడెంట్ అయ్యాక.. డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పారిపోయారు.

Bus collides with truck in UP’s Kushinagar, 12 injured

Recommended Video

Lockdown 4 Relaxations : States May Given Power Over Hotspots & Strict Restrictions

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను తమ్కుహి హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఔరాయియా రోడ్డు ప్రమాదం తర్వాత వలసకూలీల ప్రయాణంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టంచేశారు. తగిన రక్షణ చర్యలు తీసుకొకుంటే.. అనుమతించొద్దని చెప్పినా.. ప్రమాదం జరిగింది.

English summary
12 migrant labourers were gravely injured after a bus on which they had hitched rides to reach their native places in Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X