లోయలో పడిస స్కూల్ బస్సు, 12 మంది విద్యార్థుల మృతి
శ్రీనగర్: జమ్మూ - కాశ్మీర్ లోని సోషియాన్ సమీపంలో లోయలో స్కూల్ బస్సు పడిపోయింది.ఈ ఘటనలో సుమారు 12 మంది విద్యార్థులు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాజౌరీ జిల్లాలోని మన్ కోటేకు చెందిన ఘరీబ్ నవాజ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళారు. ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణీస్తున్నారు.

అయితే బస్సు పూంఛ్ సెక్టార్ సమీపంలోని సోషియాన్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు ఈ బస్సులోయలో పడిపోయింది. దీంతో బస్సులోని 12 మంది విద్యార్థులు చనిపోయారని సమాచారం అదికారులు చెబుతున్నారు.
ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఈ ప్రాంతంలో సహయకచర్యలను చేపట్టారు అధికారులు. 12 అంబులెన్స్ లను సిద్దం చేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!