వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ పారిశ్రామికవేత్త నెస్‌వాడియాకు ఆ దేశంలో రెండేళ్లు జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పారిశ్రామికవేత్త వాడియా గ్రూపు సంస్థల వారసుడు నెస్‌వాడియా ఇబ్బందుల్లో పడ్డాడు. డ్రగ్స్ విక్రయించినందుకు గాను రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు అక్కడి కోర్టు ప్రకటించింది. మార్చిలో 25 గ్రాముల గంజాయి తన దగ్గర పట్టుబడింది. దీంతో ఆయన్ను మార్చిలో జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే నెస్‌వాడియా అరెస్టు తమ వ్యాపారంపై ఏమాత్రం ప్రభావం చూపబోదని వాడియా గ్రూప్ సంస్థల అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. నెస్‌వాడియాకు శిక్ష పడినట్లు వాడియా గ్రూప్ ధృవీకరించింది.

నెస్‌వాడియా జైలులో శిక్ష అనుభవించినప్పటికీ ఆయనే తమ సంస్థల పట్ల ఎలాంటి బాధ్యతలైతే నిర్వర్తించారు అదే బాధ్యతలను ఇకపై కూడా నిర్వర్తిస్తారు అని వాడియా గ్రూప్ తెలిపింది. నెస్ వాడియా ప్రముఖ బిజినెస్ మ్యాన్ నుస్లి వాడియా కుమారుడు. జపాన్‌కు సమీపంలో ఉన్న హొక్కైడో దీవుల్లోని న్యూ చిట్సో విమానాశ్రయంలో 25 గ్రాముల గంజాయిని ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే తాను ఎవరకీ విక్రమయించేందుకు గంజాయి తనతో తీసుకురాలేదని తన కోసమే తెచ్చుకున్నట్లు తెలిపాడు.

Business tycoon Ness Wadia sentenced to 2years jail by Japan court

గంజాయి దొరకడంతో నెస్‌వాడియాపై కేసు నమోదు చేసిన అధికారులు ముందుగా జైలులో పెట్టారు. తనపై ఆరోపణలు రుజువయ్యేంత వరకు విచారణ పేరుతో అధికారులు నెస్‌వాడియాను జైలులో పెట్టారు. అనంతరం మార్చి 20న తనపై అభియోగాలు రుజువవడంతో జైలుకే పరిమితం చేశారు. 2014లో తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి ప్రీతి జింటా కేసు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత ఆ కేసును వెనక్కు తీసుకుంది. వాడియా వ్యాపార సామ్రాజ్యం దేశవిదేశాలకు విస్తరించింది. వాడియా గ్రుపు కింద బాంబే డైయింగ్, బాంబే బర్మన్ ట్రేడింగ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గోఎయిర్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి.

English summary
Ness Wadia, business tycoon and heir to the Wadia Group, has been sentenced to a two-year prison term in Japan for possessing drugs.According to a report in the Financial Times, Ness Wadia was found in possession of 25 grams of cannabis resin in March, for which he has been sentenced.The report further states that Ness Wadia was arrested in Japan in March.The Wadia Group has confirmed the sentence and said that the Japanese court did award a jail term to Ness Wadia, but the sentence has been suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X