వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యంకే అధిక ప్రాధాన్యత: మోడీ స్ట్రాటజీతో అంధకారంలోకి పారిశ్రామిక రంగం..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ భారత్‌లో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశారు. అయితే లాక్‌డౌన్ పొడిగింపు ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు అంశాలు ప్రధాని మోడీ మదిలో మెదిలాయి. ముందుగా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ మహమ్మారిని నియంత్రించేందుకు మరో రెండు వారాల పాటు పొడిగించాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ కేసులు 10వేల మార్కును దాటాయి. దీంతో లాక్‌డౌన్ ఇప్పుడిప్పుడే ఎత్తివేయడం సాధ్యం కాదనేది స్పష్టమవుతోంది.

కుదేలైన పారిశ్రామిక రంగం

కుదేలైన పారిశ్రామిక రంగం

ఇక కరోనావైరస్ విజృంభిస్తుండటంతో పారిశ్రామిక రంగం కూడా పూర్తి స్థాయిలో కుదేలైంది. దీంతో ఉత్పత్తి లేక ఆర్థికంగా దేశం నష్టాల్లో కూరుకుపోతోంది. అయితే పరిశ్రమలను తిరిగి తెరవాలనే డిమాండ్లు ప్రధాని దృష్టికి వచ్చాయి. అంతేకాదు కొన్ని షరతులతో వాటిని నడిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. ఆర్థికంగా చాలా నష్టపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చాయి. అయితే ఎంపిక చేయబడ్డ కొన్ని పరిశ్రమలను మాత్రం తెరిచేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోడీ వద్దకు డిమాండ్లు పెరిగాయి. అయితే ఇక లాక్‌డౌన్ పొడిగింపు, అదే సమయంలో పరిశ్రమలను తిరిగి ప్రారంభించడం వంటివాటిపై ప్రధాని చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రధాని రెండిటినీ దాదాపుగా బ్యాలెన్స్ చేశారు.

Recommended Video

India Lockdown : Lockdown Extended Till May 3, PM Modi Speech Highlights
గరీబీ కల్యాణ్ యోజనా పథకం అమలు చేస్తే పరిస్థితేంటి..?

గరీబీ కల్యాణ్ యోజనా పథకం అమలు చేస్తే పరిస్థితేంటి..?

ఇక జీవనోపాధి కంటే కూడా జీవితాలే ముఖ్యమని చెప్పిన ప్రధాని మోడీ జీవనోపాధి కోసం గరీబీ కల్యాణ్ యోజనా పథకంను అమలు చేస్తామని చెప్పారు. అయితే ఇది అమలు చేస్తే ఆర్థికంగా దేశం మరింత ఇబ్బందుల్లోకి నెట్టవేయబడుతుందనేది సుస్పష్టంగా తెలుస్తోంది. వృద్ధి మరింత క్షీణిస్తుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఉత్పత్తిని స్మూత్‌గా రన్ చేయలేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవి కరోనా హాట్‌స్పాట్‌లో లేని ఫ్యాక్టరీలు అయినా సరే ఉత్పత్తి అంత స్మూత్‌గా జరగవనేది ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

ఏప్రిల్ 20 వరకు కరోనా కేసులు తగ్గుతాయా..?

ఏప్రిల్ 20 వరకు కరోనా కేసులు తగ్గుతాయా..?

ఏప్రిల్ 20వరకు ఎక్కడైతే కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయో అక్కడ కొన్ని సడలింపులు మినహాయింపులను ఇస్తామని మోడీ తన ప్రకటనలో చెప్పారు. లాక్‌డౌన్ నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తామని చెప్పారు. కానీ అది సాధ్యమవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వ్యాపారాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి వస్తువులను ఉత్పత్తి చేయడం అంత సులువైన పని కాదు. ఒకవేళ తయారైనా ఫ్యాక్టరీల నుంచి అవి బయటకు వెళ్లాలి అదే సమయంలో కొనుగోలు చేసేవారుండాలి. ఇది ఒక సవాలనే చెప్పాలి. మే 3 వరకు లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది అసాధ్యంగానే కనిపిస్తోంది.

మోడీ ప్రసంగంలో పాజిటివ్ అంశాలు ఏంటి..?

మోడీ ప్రసంగంలో పాజిటివ్ అంశాలు ఏంటి..?

ఇదిలా ఉంటే దేశంలో లాక్‌డౌన్‌ను కఠినంగా పాటిస్తూనే ప్రజలను ప్రధాని అభినందించడం శుభపరిణామం అని చెప్పొచ్చు. ప్రజలు పడుతున్న కష్టాన్ని గురించి ప్రధాని మోడీ మాట్లాడటం చూసిన వారు... మోడీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలని డిసైడ్ అయ్యారు. ఇక అదే సమయంలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను కూడా ప్రధాని మోడీ సున్నితంగా పంపారు. అయితే ప్రధాని మోడీ ప్రసంగం నుంచి రెండు పాజిటివ్ అంశాలను తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో కరోనావైరస్ కేసులకు సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూస్తే కర్వ్ ఫ్లాట్‌గా మారుతోంది. అంటే కేసుల సంఖ్య ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే తగ్గుముఖం పడుతున్నాయనే విషయం అర్థం అవుతోంది.అంతేకాదు లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను తొలగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా శుభపరిణామమే అనే విశ్లేషణలు జరుగుతున్నాయి.

English summary
PM Modi said that only areas that are able to successfully implement the lockdown and demonstrate a significant drop in Covid-19 cases by April 20 will be allowed to ease the lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X