వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పు వస్తుంది... కత్తులు కొని సిద్దంగా ఉండండి.. బీజేపీ నేత

|
Google Oneindia TeluguNews

అయోధ్య భూ వివాదంపై సుప్రిం కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు జడలు విప్పుతున్నారు. సుప్రింలో వాదనలు ముగిసిన తర్వాత ఇప్పటికే పలువురు ఆధ్యాత్మిక గురువులు, మరియు బీజేపీ నేతలు రాంమందిర నిర్మాణం ఖచ్చితంగా జరిపి తీరుతామని ముందుగానే హింట్ ఇచ్చారు. కాగా సుప్రిం తీర్పుపై ప్రభావం చూపే విధంగా దీంతో పలువురు బీజేపీ నేతలు ఆయోధ్య వివాదంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ధనత్రయోదశి నాడు బంగారం బదులు కత్తులు కొనండి

ధనత్రయోదశి నాడు బంగారం బదులు కత్తులు కొనండి

ఉత్తరప్రదేశ్‌లో గజరాజ్ రాణా అనే బీజేపీ నాయకుడు వివాద్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న దీపావళీకి ముందు వచ్చే ధనత్రయోదశి నాడు సాధరణంగా ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే అప్పుడు బంగారం కొనుగోలు చేయకుండా కత్తులు కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చాడు. అయోధ్య తీర్పు వస్తున్న నేపథ్యంలో పరిస్థితులను బట్టి ప్రజలు మారాలని హిందు సోసైటీకి పిలుపునిచ్చారు. కాగా ప్రజలు కొనే కత్తులు భవిష్యత్‌లో కూడ ఉపయోగపడతాయని చెప్పారు. ఇవి తమను తాము రక్షించుకునేందుకు కూడ ఉపయోగపడతాయని అన్నారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటీ పరిస్థితులైన ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు.

బీజేపీ నేత వ్యాఖ్యలు వివాస్పదం

బీజేపీ నేత వ్యాఖ్యలు వివాస్పదం

కాగా గజరాజ్ రాణా గతంలో కూడ ఇలాంటీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం పవిత్ర స్థలం మక్కాలో శివలింగం ఉందని, గతంలో హిందువులు కూడ అక్కడ నివాసం ఉండేవారిని ఆయన వ్యాఖ్యానించారు. ఇక గజరాజ్ రాణా వ్యాఖ్యలు యూపీలో వివాదస్పద అయ్యాయి. దీంతో గజరాజ్ రాణా చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతమని చెప్పడంతో పాటు ,బీజేపీకి సంబంధం లేదని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ అన్నారు. పార్టీ నేతలు చట్టానికి లోబడి స్పందించాలని పార్టీ మార్గదర్శకాలు ఉన్నాయని సూచించారు. పార్టీ సభ్యులు వివాదాల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.

గజరాజ్ వాఖ్యలపై వివరణ

గజరాజ్ వాఖ్యలపై వివరణ

దీంతో గజరాజ్ రాణా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను హిందూ పురాణాల్లో దేవుళ్లు, దేవతలు కూడా ఆయా సందర్భాల్లో తమకు అనుకూలమైన ఆయుధాలు ధరించి ధర్మరక్షణకు పాటుపడ్డారని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు ఆకోనంలోనే అర్థం చేసుకోవాలి తప్ప వేరే అభిప్రాయంతో చూడవద్దని అన్నారు.

నవంబర్ 18లోపు అయోధ్య తీర్పు ..?

నవంబర్ 18లోపు అయోధ్య తీర్పు ..?

అయోధ్య వివాదంపై సుప్రిం కోర్టు చీఫ్ జస్టీస్ రంజన్ గోగోయ్ అధ్యర్యంలో నలబై రోజుల పాటు వాదనలు కొనసాగిన విషయం తెలిసిందే.. దీంతో ఆయన విదేశాలకు సైతం వెళ్లకుండా తీర్పును వెలువరించేందుకు సిద్దం అవుతున్నట్టు సమాచారం. కాగా రంజన్‌గగోయ్ నవంబర్ 18న పదవివిరమణ పోందుతుండడంతో ఈ లోపు తీర్పు వస్తుందని అందరు భావిస్తున్నారు. కాగా ధనత్రయోదశి అక్టోబర్ 25న రాబోతున్న విషయం తెలిసిందే.

English summary
Buy iron swords on Dhanteras to prepare for Ayodhya verdict
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X