వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ జోరు -11రాష్ట్రాల్లో 58సీట్లకుగానూ 41చోట్ల గెలుపు

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటే మరో 11 రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా, మంగళవారం వాటి ఫలితాలు విడుదలయ్యాయి. బీహార్ సహా అన్ని చోట్లా బీజేపీ తన ఆదిక్యాన్ని కనబర్చింది. అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. 11 రాష్ట్రాల్లోని 58 సీట్లకు ఉప ఎన్నిక ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించింది.

బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్

11 రాష్ట్రాల్లోని 58 సీట్లకు ఉప ఎన్నిక జరగ్గా, వాటిలో 41 స్థానాలు కమలం ఖాతాలోకి చేరాయి. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో అన్ని స్థానాలనూ బీజేపీనే ఎగరేసుకుపోయింది. కాగా కాంగ్రెస్ అక్కడక్కడా తన ఉనికిని చాటుకుంది. ఈ ఉప ఎన్నికల్లో స్థానిక పార్టీలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లే ఎక్కువ స్థానాలను గెలుచుకున్నాయి.

By Election Result 2020: actross 11 states here is the result of 58 seats

11 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక -2 (బీజేపీ), గుజరాత్-8 (బీజేపీ), యూపీ-7 (బీజేపీ-6, ఎస్పీ-1), ఛత్తీస్‌గడ్-1 (కాంగ్రెస్), జార్ఖండ్-2 (కాంగ్రెస్-1, జేఎంఎం-1), మధ్యప్రదేశ్-28 (బీజేపీ-20, కాంగ్రెస్-8), మణిపూర్-5 (బీజేపీ-4, స్వతంత్ర-1), నాగాలాండ్-1 (ఎన్‌డీపీపీ-1, స్వతంత్ర-1), ఓడిశా-2 (బీజేడీ), తెలంగాణ-1 (బీజేపీ), హర్యానా-1 (కాంగ్రెస్)

English summary
bjp perofmed well in By Election Result 2020 whitch declered on tuesday. out of 58 seats across 11 states, bjp bags 40 seats. The BJP has so far won 19 out of the 28 assembly constituencies in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X