వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్‌పై భారతీయ ముద్ర: ఆ బిగ్‌షాట్ పెట్టుబడులు? చర్చల దశలో: ఫలిస్తే.. వారికి పండగే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచుకుంది భారత్. ఆ దేశంతో కుదుర్చుకున్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. చైనా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంది. రైల్వే, టెలికం, ఇన్‌ఫ్రా వంటి కీలక రంగాల్లో చైనా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన పనులను ఉపసంహరించింది. తాజాగా టిక్‌

Recommended Video

TikTok లో పెట్టుబడుల దిశగా Reliance Industries తో ByteDance చర్చలు, టిక్‌టాక్‌ కోసం దిగ్గజ కంపెనీలు!
 టిక్‌టాక్‌కు మంచి ఆదరణ

టిక్‌టాక్‌కు మంచి ఆదరణ

చైనాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు తయారు చేసిన పలు యాప్‌లపైనా భారత్ వేటు వేసింది. చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటి 59 రకాల యాప్‌లను వినియోగానికి బ్రేక్ వేసింది. భారత్‌లో టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించే 80 శాతం మంది టిక్‌టాక్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే భారత్‌లో దానికి ఉన్న ఆదరణ ఏ రేంజ్‌లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

 రిలయన్స్‌తో బైట్ డాన్స్ చర్చలు

రిలయన్స్‌తో బైట్ డాన్స్ చర్చలు

చైనాతో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం అనంతరం.. టిక్‌టాక్‌పై నిషేధం వేటు పడిన ప్రస్తుత పరిస్థితుల్లో బైట్‌డాన్స్ యాజమాన్యం కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా ముద్రను చెరిపి వేసుకునేలా అడుగుల వేస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్‌పై భారతీయ ముద్ర పడేలా చేయడానికి ప్రయత్నాలను ఆరంభించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా- పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్చల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

 ఆఫర్‌ను అంబానీ అంగీకరిస్తారా..?

ఆఫర్‌ను అంబానీ అంగీకరిస్తారా..?

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ యాజమాన్యంతో ఇప్పటికే ఈ దిశగా ప్రతిపాదనలను పంపించినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురించింది. టిక్‌టాక్‌కు ఉన్న భారత్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించడానికి అవకాశాల లేకపోలేదని అంటున్నారు. ఈ చర్చలు గనక ఫలిస్తే.. టిక్‌టాక్ మరోసారి దేశంలో తన ప్రభంజనాన్ని కొనసాగించడం, పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 టిక్‌టాక్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు దిగ్గజ కంపెనీలు

టిక్‌టాక్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు దిగ్గజ కంపెనీలు

అమెరికాలో కూడా టిక్‌టాక్ నిషేధం వేటును ఎదుర్కొంటోంది. అదే సమయంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్, ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంస్థలు టిక్‌టాక్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయంటూ ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. రిలయన్స్ యాజమాన్యం కూడా ఈ దిశగా సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా చెబుతోంది. ఆయా సంస్థలు టిక్‌టాక్‌లో పెట్టగలిగితే.. చైనా ముద్ర చెరిగిపోతుందని, ఫలితంగా నిషేధం వేటు తప్పుతుందని అంచనా వేస్తున్నాయి.

English summary
China's ByteDance is in early talks with Reliance Industries Ltd for an investment in its video-based app TikTok's business in India. The two companies began conversations late last month and have not reached a deal yet, according to the report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X