వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీ ఓటర్ ఎగ్జిట్ పోల్: యూపిలో కమల వికాసం, పంజాబ్ లో ఆప్ హావా

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో కమలం వికసిస్తోందని, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ హావా కొనసాగించిందని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తోంది.పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లను సాధించే అవకాశం ఉందని సర్వే ను బట్టి తెలుస్తోంది.

సీ ఓటర్ ఎగ్జిట్ ఓట్ల సర్వే ఫలితాల ప్రకారం

C Voter predicts win for AAP in Punjab, lead for BJP in UP

పంజాబ్ రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనే అవకాశాలు ఉన్నాయని సీ ఓటర్ ఎగ్జిట్ ఫలితాల ప్రకారం తెలుస్తున్నాయి. సీ ఓటర్ సర్వే ప్రకారంగా ఆప్ పార్టీ 59 నుండి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీ 41 నుండి 49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే చెబుతోంది.అయితే ఇప్పటివరకు పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి అకాలీదళ్ కూటమి 5 నుండి 13 స్థానాలకు పరిమితం కానుందని ఈ సర్వే చెబుతోంది.

అంతేకాదు సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించే అవకాశం ఉంది.అయితే ఆప్ కు ఈ ఎన్నికల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని సర్వే తెలుపుతోంది.

ఉత్తరాఖండ్ లో బిజెపి కాంగ్రెస్ పార్టీల మద్య హోరా హోరి పోటీ ఉండే అవకాశం ఉందని సీ ఓటర్ ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నాయి.బిజెపి, కాంగ్రెస్ పార్టీలు 29 నుండి 35 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.అయితే 2 నుండి 9 సీట్ల వరకు ఇతరులు కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

గోవాలో రాష్ట్రంలో బిజెపి విజయం సాధించే అవకాశం ఉందని సీ ఓటర్ ఎగ్జిట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బిజెపి గోవా రాష్ట్రంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.గోవా రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపి సుమారు 15 నుండి 21 స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంది.అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో రంగ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టికి కొంత నష్టం వాటిల్లింది.అయితే గోవా రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది.అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సుమారు 12 నుండి 18 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఆ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

మణిపూర్ రాష్ట్రంలో బిజెపి విజయం సాధించే అవకాశం ఉందని సీ ఓటర్ అభిప్రాయపడింది.అయితే మణిపూర్ రాష్ట్రంలో 25 నుండి 31 స్థానాల్లో బిజెపి విజయం సాధించే అవకాశం ఉందని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలుపుతోంది.కాంగ్రెస్ పార్టీ 17 నుండి 23 స్థానాలను కైవసం చేసుకొనే అవకాశాలున్నాయని కూడ ఈ సర్వే వెల్లడిస్తోంది.అయితే కాంగ్రెస్ పార్టీ మణిపూర్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గట్టిపోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారంగా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.కాంగ్రెస్ పార్టీ 17 నుండి 23 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది.ఇరోన్ షర్మిల సహ స్వతంత్రులు 9 నుండి 15 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే చెబుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి అత్యధిక స్థానాలు విజయం సాధించే అవకాశాలున్నాయని సీ ఓటర్ ఎగ్జిట్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో బిజెపికి సీట్లు వచ్చే అవకాశం మాత్రం లేదు.అయితే ఇతరుల మీద ఆదారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి 155 నుండి 167 సీట్లు దక్కే అవకాశం ఉంది.403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో 202 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవాలంటే ఇతర పార్టీలపై ఆధారపడాల్సిందే.కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీ కూటమి 135 నుండి 147 సీట్లను దక్కించుకొనే అవకాశం ఉందని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడిస్తోంది.బిఎస్ పి 81 నుండి 93 వరకు సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.స్వతంత్రులు 8 నుండి 20 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంది.

English summary
C-voter exit polls predicted a clear win for the Aam Aadmi party in Punjab with a comfortable 59 to 67 seats out of the 117 assembly seats in the state. AAP hold the clear win over vote share with Congress projected to win anywhere between 41 to 49 seats according to C-voter exit poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X