వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CAA protest : అస్సాంలో 10 రోజుల తర్వాత కోర్టు ఆదేశాలతో అందుబాటులోకి ఇంటర్నెట్ సేవలు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసోంలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి.పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే .దాదాపు 10 రోజుల తర్వాత కోర్టు ఆదేశాలతో నేడు అసోం లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి.

Citizenship Act:యూపీలో ఉద్రిక్తత..మొబైల్, ఇంటర్నెట్ సేవలు 21వ తేదీ వరకు బంద్Citizenship Act:యూపీలో ఉద్రిక్తత..మొబైల్, ఇంటర్నెట్ సేవలు 21వ తేదీ వరకు బంద్

హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో పది జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . రాష్ట్రంలో శాంతి, ప్రశాంతతకు సోషల్‌మీడియా వేదికలు భంగం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపిన విషయమ తెలిసిందే . లఖింపూర్‌, ధిమాజీ, తిన్సుకియా, డిబ్రుగఢ్‌, చారాడియో, శివసాగర్‌, జోర్హాట్‌, గోలాఘాట్‌, కామ్‌రూప్‌ (మెట్రో), కామ్‌రూప్‌ జిల్లాల్లో సేవలను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది.

CAA Protest: Internet services available after 10 days of court orders in Assam

అయితే దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మొబైల్ డేటా మరియు బ్రాడ్‌బ్యాండ్ రెండింటి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే అంశంపై జర్నలిస్ట్ అజిత్ కుమార్ భూయాన్, న్యాయవాది బోనోశ్రీ గొగోయ్ మరియు మరో ఇద్దరు గౌహతి కోర్టులో పిటీషన్ లను దాఖలు చేశారు. నాలుగు పిఎల్‌లను విచారించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారించి , ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా, జస్టిస్ అచింత్య మల్లా బుజోర్ బారువాతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని చెప్పటంతో నేటి నుండి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

English summary
The Gauhati High Court passed an order directing the Assam government to consider restoration of Internet services, both mobile Internet services and broadband, After hearing four PILs and considering the difficulties faced by people, a division bench of the high court comprising Chief Justice Ajay Lamba and Justice Achintya Malla Bujor Barua passed the order on Tuesday directing the state government to consider restoration of Internet services. Finally government restored the services after 10 days .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X