• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాలో మోదీ సర్కార్ అనూహ్యం -ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ దరఖాస్తులు -CAA రూల్స్ లేకున్నా

|

దేశంలో కరోనా మహమ్మరి రెండో దశ విలయం కొనసాగుతూ, తాజాగా 3,617 మరణాలు, 1.73లక్షల కొత్త కేసులు నమోదుకాగా, టీకాల కొరత వేధిస్తున్నది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిపై అనుమానాలు నెలకొన్న వేళ.. భారతీయులందరికీ సరిపడా వ్యాక్సిన్లను విదేశాల నుంచే దిగుమతి చేస్తామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసినా, ఆ దిశగా ప్రయత్నాలేవీ సాగకపోవడం, అతి త్వరలోనే మూడో వేవ్ తలెత్తనుందనే హెచ్చరికల నడుమ పరిస్థితి దాదాపు గందరగోళంగా మారింది. కొవిడ్ నిర్వహణలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు ఈ విపత్కర సమయంలో సీఏఏకు సంబంధించి అనూహ్య అడుగులు వేసింది..

షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపుషాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపు

కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనంకూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనం

 ముస్లిమేతరులకు ఆహ్వానం

ముస్లిమేతరులకు ఆహ్వానం

మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(2019)పై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, ఆందోళనలు రేకెత్తడంతో దాని అమలును తాత్కాలికంగా పక్కన పెట్టేసిన కేంద్రం.. తర్వాతి కాలంలో కొవిడ్ విలయం వల్ల సీఏఏ అమలు ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చింది. అలాంటిది ఉన్నట్టుండి శుక్రవారం మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ కేంద్ర హోం శాక నిన్న ఒక గెజిట్ విడుదల చేసింది.

5 రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో..

5 రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో..

సీఏఏ చట్టం ప్రకారం మన పొరుగున ఉండే అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ లో అక్కడి ప్రభుత్వాల చేత హింసను తట్టుకోలేక భారత్ కు వచ్చేసిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే వీలుంటుంది. 2014, డిసెంబర్ 31 కంటే ముందు భారత్ లోకి ప్రవేశించిన ఆ మూడు దేశాల హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్‌లు, పార్శీలు, క్రైస్తవులకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. సీఏఏలో ముస్లింలను మినిహాయించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. కాగా,

సీఏఏ రూల్స్ ఇంకా రూపొందకున్నా..

సీఏఏ రూల్స్ ఇంకా రూపొందకున్నా..

పాక్, అఫ్గాన్, బంగ్లా నుంచి శరణార్థులుగా భారత్ కు వచ్చిన ముస్లిమేతరులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వీటిపై వివిధ స్థాయిల్లో పరిశీలన జరుగుతుందని హోశాఖ తన గెజిట్ లో పేర్కొంది. నిజానికి పార్లమెంటులో సీఏఏ ఆమోదం పొంది రెండేళ్లు పూర్తయినా ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలు, విధివిధానాలను మోదీ సర్కార్ ఇంకా రూపొందించలేదు. సీఏఏ రూల్స్ లేకుండానే ఇప్పుడు ప్రత్యేక గెజిట్ నోట్ ద్వారా ప్రక్రియను ప్రారంభించడం, అది కూడా కొవిడ్ వేళ చేపట్టడం గమనార్హం. పౌరసత్వ చట్టం-1955 కింద, 2009లో చేసిన చట్టంలోని ఒక నిబంధనల కింద ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. సీఏఏ-2019కి రూల్స్ లేనందున ప్రస్తుత నోటిఫికేషన్‌కు ఆ చట్టంతో సంబంధంలేదని కేంద్ర పేర్కొంది.

English summary
With the Centre yet to frame rules under the Citizenship Amendment Act (CAA) 2019, it issued a gazette notification Friday granting powers under existing rules to authorities in 13 districts of Gujarat, Chhattisgarh, Rajasthan, Haryana and Punjab to accept, verify and approve citizenship applications from members of minority communities hailing from Pakistan, Afghanistan and Bangladesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X