• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అతి త్వరలో దేశవ్యాప్తంగా CAA - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటన - కరోనా వల్లే ఆలస్యమైంది

|

కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్యలో అతి త్వరలోనే అమెరికాను దాటేస్తోందన్నంత వేగంగా భారత్ లో కొత్త కేసులు నమోదవుతున్నా.. బీహార్ ఎన్నికల సందడితో దేశమంతా రాజకీయ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో అతి త్వరలోనే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేయబోతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.

చైనా దూకుడుకు చెక్:భారత్ కూటమిలో ఆస్ట్రేలియా - మలబార్ విన్యాసాలకు ఆసీస్ నౌకాదళంచైనా దూకుడుకు చెక్:భారత్ కూటమిలో ఆస్ట్రేలియా - మలబార్ విన్యాసాలకు ఆసీస్ నౌకాదళం

గతేడాది డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు జరగడం, మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఆందోళనలకు బ్రేక్ పడటం, అదే క్రమంలో సీఏఏ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడం తెలిసిందే. చట్టంగా రూపొందిన సీఏఏను కరోనా కారణంగానే ఇన్నాళ్లూ అమలు చేయలేకపోయామన్న నడ్డా.. అది త్వరలోనే అమలులోకి వస్తుందని చెప్పారు.

CAA will be implemented very soon, delayed due to COVID-19, says BJP chief JP Nadda

వచ్చేఏడాది ప్రారంభంలో జరుగనున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం భారీ ప్రణాళికలు రచిస్తోన్న బీజేపీ.. చిన్న సమావేశాలను సైతం పెద్ద నేతలతోనే నిర్వహిస్తున్నది. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా సోమవారం సిలిగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని, ఎన్నికల వ్యూహంపై చర్చోపచర్చలు జరిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీసీఏ అమలుపై వ్యాఖ్యలు చేశారు.

షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్

బెంగాల్ లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, ప్రజలను విభజించి పాలిస్తూ, కుటిల రాజకీయాలు చేస్తోన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బుద్ధి చెబుతామని నడ్డా అన్నారు. మమతా హయాంలో హింసాత్మక రాజకీయాలు, కట్‌-మనీ సంస్కృతికి ప్రజలు విసిగిపోయారని.. ఓటుతోనే సమాధానం చెబుతారని నడ్డా వ్యాఖ్యానించారు.

అల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ సర్వే - కీలక ఆదేశాలుఅల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ సర్వే - కీలక ఆదేశాలు

English summary
Bharatiya Janata Party (BJP) president JP Nadda on Monday said that the Citizenship Amendment Act (CAA) will be implemented 'very soon'. Addressing a rally in Siliguri, Nadda said said that the party is committed to implementing CAA and that "all will get its benefit." "Due to COVID-19 pandemic, implementation of CAA got delayed. But as the situation is slowing improving, work has started and rules are now being framed. It (CAA) will be implemented very soon," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X