బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నడి రోడ్డులో ప్రముఖ లేడీ సింగర్ కు టార్చర్ పెట్టిన క్యాబ్ డ్రైవర్: బూతులు, ఎస్కేప్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయి ప్రముఖ లేడీ సింగర్ కు నడిరోడ్డు మీద బూతులు తిట్టాడని ఆరోపణలు రావడంతో కేసు నమోదు అయ్యింది. లేడీ సింగర్ వసుంధరా దాస్ ను దూషించిన క్యాబ్ డ్రైవర్ కోసం మల్లేశ్వరం పోలీసులు గాలిస్తున్నారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవంబర్ 29వ తేదీ సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రముఖ సింగర్ వసుంధరా దాస్ కారులో భాష్యం సర్కిల్ నుంచి మల్లేశ్వరంలోని మార్గోసా రోడ్డు వైపు బయలుదేరారు.

Cab Driver abuses singer Vasundhara Das in Bengaluru.

అదే సందర్బంలో క్యాబ్ నెంబర్ KA-05,AE-3933 లేడీ సింగర్ వసుంధరా దాస్ కారు వెనుక వెళ్లింది. రెండు కార్లు భాష్యం సర్కిల్ నుంచి ఒకదాని వెనుక ఒకటి మల్లేశ్వరం 18వ క్రాస్ వరకు వెళ్లింది. మల్లేశ్వరం 18వ క్రాస్ దగ్గర వసుంధరా దాస్ కారు నిలిపి డోర్ తీసి బయటకు వచ్చారు.

ఆ సందర్బంలో కారు నిలిపిన క్యాబ్ డ్రైవర్ వసుంధరా దాస్ ను బూతులు తిట్టారని ఆరోపణలు ఉన్నాయి. సహాయం కోసం కేకలు వెయ్యడంతో క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి కారులో పరారైనాడని వసుంధరా దాస్ మల్లేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భాష్యం సర్కిల్ లో క్యాబ్ డ్రైవర్ రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉందని, అయితే ఆసందర్బంలో వసుంధరా దాస్ కారు సిగ్నల్ లో బ్లాక్ చెయ్యడంతో క్యాబ్ డ్రైవర్ మల్లేశ్వరంలోని మార్గోసా రోడ్డు వరకు వెంబడించి ఆమెను బూతులు తిట్టాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

English summary
Karnataka: Cab Driver abuses singer Vasundhara Das in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X