వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రైవర్ హస్తప్రయోగం చేసుకున్నాడు: లేడీ ప్యాసెంజర్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పడానికి మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన మంగళవారంనాడు వెలుగు చూసింది. జులై 2వ తేదీన ఢిల్లీ నుంచి ఫరీదాబాద్‌కు టాక్సీ మాట్లాడుకున్న ఓ మహిళ భయానకరమైన దృశ్యాన్ని చూసింది.

ఆ భయానకమైన సంఘటనను ఆమె ఫేస్‌బుక్‌లోనూ ట్విట్టర్‌లోనూ వివరించింది. తాను ప్రయాణిస్తున్న టాక్సీని నడుపుతూ టాక్సీ ఫర్ స్యూర్ క్యాబ్ డ్రైవర్ హస్తప్రయోగం చేసుకున్నాడని ఆమె చెప్పింది. తాను ఓలాక్యాబ్స్‌క ఫోన్ చేస్తే టాక్సీ ఫర్ స్యూర్ క్యాబ్ వచ్చిందని ఆమె చెప్పింది.

Cab driver masturbated while driving, claims woman passenger

ఈ సంఘటన వెలుగు చూడడంతో టాక్సీ ఫర్ స్యూర్ డ్రైవర్ దేవందర్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. నిరుడు డిసెంబర్‌లో 25 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్‌పై ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటనను మరిచిపోక ముందే ఈ సంఘటన వెలుగు చూసింది.

నిరుడు డిసెంబర్ 5వ తేదీన మహిళా ఎగ్జిక్యూటివ్‌పై ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అయిన 32 ఏళ్ల శివకుమార్ యాదవ్ అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Yet another incident has come to fore on Tuesday, which puts serious question marks on the security of the women opting for app based taxi services in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X