వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహిత, క్యాబ్ డ్రైవర్ మధ్యలో 14 నెలల బాలుడు.. పర్సు నుంచి డబ్బులు తీస్తుండగా...

|
Google Oneindia TeluguNews

రెప్పపాటులో ఆమె చేసిన తప్పిదం.. మనోవేదనకు కారణమైంది. తన చిన్నారిని కాస్త పట్టించుకోకపోవడం ఆమెను చిత్రవధకు గురిచేసింది. కళ్లు మూసి తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన ఒడిలో ఉండాల్సిన 14 నెలల పసికందు మృత్యుఒడికి చేరిన విషాదకర ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. చిన్నారి చనిపోయాడని తెలిసి తల్లి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

భార్య, భర్త, బాబు

భార్య, భర్త, బాబు

ఘజియాబాద్‌లోని మహాగన్ మస్కట్ హౌసింగ్ సోసైటీలో ఓ వివాహిత తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. భర్త విధులు నిర్వహిస్తుండగా, తాను హౌస్ వైఫ్‌గా ఉన్నారు. ఆమెకు 14 నెలల బాబు కూడా ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి తన బాబుతో కలిసి బయటకెళ్లి.. తిరిగొచ్చింది. అయితే ఆమె నిర్లక్ష్యం తన కుమారుడిని బలితీసుకుంది. రెప్పపాటులో ఆమె వహించిన అలసత్వం తన బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లేందుకు కారణమైంది.

కారు దిగి ..

కారు దిగి ..

బయటకెళ్లిన వివాహిత కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి తన ఇంటికొచ్చారు. కారు ఇంటి వద్ద ఆగింది. ఇంతలో 14 నెలల బాలుడు మెల్లగా కారుడోర్ తీసుకొని బయటకు వెళ్లాడు. కారు ముందుకెళ్లి అక్కడ కూర్చొన్నాడు. తన కుమారుడిని పట్టించుకోని మహిళ.. క్యాబ్‌కు డబ్బులు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఎట్టకేలకు నగదు తీసి మనీ అందజేసింది. తర్వాత కారు దిగి కాస్త నడిచి ముందుకెళ్లింది.

క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం

క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం

ఆ డ్రైవర్ ఏ పరధాన్యంలో ఉన్నాడో తెలియదు. తన కారు ముందు ఉన్న చిన్నారిని ఢీ కొట్టాడు. ఆ బాలుడి కేకలు విని తల్లి పరుగు తీసుకుంటూ వచ్చింది. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావమైంది. ఆ క్యాబ్‌లో హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో బాలుడు చనిపోయాడు. తన కుమారుడు చనిపోయాడని తెలిసి, ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది.

సారీ చెప్పి..

సారీ చెప్పి..

బాలుడి మృతి చెందాడని తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ మెల్లగా జారుకున్నాడు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. జరిగిన ఘటన గురించి బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సెక్యూరిటీ తెలిపారు. చిన్నారిపై క్యాబ్ వెళ్లే సమయంలో తాను దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. తన బాబు ఎక్కడ అని తల్లి తేరుకునేలోపు ప్రమాదం జరిగిందని సెక్యూరిటీ గార్డు పోలీసులకు తెలిపారు. తల్లి కొంచెం అప్రమత్తంగా ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
14-month-old boy was killed in Ghaziabad after a cab ran over him while his mother was busy paying the fare. The accident took place in Mahagun Mascot housing society in Crossing Republik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X