వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ లో జనరల్ క్యాటగిరీకి 10 శాతం రిజర్వేషన్ .. చట్ట సవరణకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినేట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కేంద్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు ప్రయారిటీ ఇచ్చింది. అలాగే కిసాన్ సన్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టి .. రైతుల మది దోచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కశ్మీర్ .. ఇతర సున్నిత అంశాల పరిష్కారం కోసం పాటుపడుతోంది.

Cabinet approves 10% reservation for general category poor in J&K

రిజర్వేషన్లకు ఓకే ..
జమ్ము కశ్మీర్ లో వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో .. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ భేటీ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. కశ్మీర్ కు రూపొందించిన ప్రత్యేక హక్కుల చట్టాన్ని 77వ రాజ్యాంగ ముసాయిదాకు కొన్ని మార్పులు చేసింది. 2019 చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగ ప్రమోషన్లలో లభ్ది చేకూరనుంది. దీంతోపాటు ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టంచేశారు.

ఆగ్రా, కాన్పూర్ మెట్రో ప్రాజెక్టులకు అంగీకారం
కశ్మీర్ రిజర్వేషన్లతోపాటు ఆగ్రా, కాన్పూర్ లో మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటితోపాటు ఆధార్ చట్టబద్ధత ముసాయిదా, 2005 మనీ ల్యాండరింగ్ చట్టం, 1885 భారత టెలీగ్రాప్ చట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు ఆర్డినెన్స్ లకు గత జనవరిలో జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం లభించింది. అయితే రాజ్యసభలో ఆమోదం పొందకపోవడంతో మళ్లీ ఆర్డెనెన్స్ లో రూపంలో తీసుకొచ్చారు.

English summary
The Union Cabinet has approved the Constitution (Application to Jammu and Kashmir) Amendment Order, 2019. Briefing media after the Cabinet meeting, Finance Minister Arun Jaitley said it will serve the purpose of application of relevant provision of the constitution as amended through the constitution (77th Amendment) act, 2019 for Jammu and Kashmir by issuing the constitution Amendment order. He said, once notified, this will pave the way for giving the benefit of promotion in service to the SCs, STs and also extend the reservation of up to 10 per cent for the economically weaker section in educational institution and public employment in addition to the existing reservation in the state. The Cabinet has approved the Jammu and Kashmir Reservation (Amendment) Ordinance, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X