వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీటీహెచ్‌ మార్గదర్శకాలకు సవరణ -ఇకపై 20 ఏండ్లకు లైసెన్స్‌ -కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడి

|
Google Oneindia TeluguNews

దేశంలో డైరెక్ట్‌ టు హోమ్‌ టెలివిజన్‌ (డీటీహెచ్‌) మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై డీటీహెచ్‌ లైసెన్స్‌ను 20 ఏండ్లకు ఇస్తారు. లైసెన్స్‌ ఫీజును మూడునెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) వసూలు చేయనున్నారు.

చైనా కిరాతకంగా మన జవాన్ల నెత్తురు పారించిన గాల్వాన్ లోయలో పూలతోట అభివృద్ధి..చైనా కిరాతకంగా మన జవాన్ల నెత్తురు పారించిన గాల్వాన్ లోయలో పూలతోట అభివృద్ధి..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్ణయాలను వివరించారు..

Cabinet approves revision in DTH guidelines, license to be now issued for 20 yrs: Javadekar

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రకారం ఇప్పటి వరకు డీటీహెచ్‌, ఎంఎస్‌వో వంటి అన్ని సర్వీసు ప్రొవైడర్లకు లైసెన్స్‌ను 10 ఏండ్ల కాలనానికి జారీ చేస్తుండగా తాజాగా దీనిని 20 ఏండ్లకు పెంచినట్లు మంత్రి జవదేకర్ చెప్పారు. అదే సమయంలో డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య మౌళిక సదుపాయాల షేరింగ్‌కు అనుమతిచ్చారు.

మరోవైపు ఫిల్మ్స్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేయడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని జవదేకర్ తెలిపారు.

రోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్రోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్

దేశంలో 4 కోట్లకు పైగా ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు ఐదేండ్లలో 59,000 కోట్ల విలువైన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసే పథకానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. ఇందులో రూ.35,534 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని వివరించారు.

English summary
Union information and broadcasting (I&B) minister Prakash Javadekar on Wednesday said that the Cabinet has decided to approve revision in the guidelines for providing Direct-to-home television (DTH) services in the country. Javadekar said that license for DTH would be issued for 20 years and the license fee would be collected on a quarterly basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X