వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే: ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తీవ్రమైన శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది. శనివారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం చిన్నారులపై అత్యాచారాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.

పోస్కో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం జరిపివారికి మరణశిక్ష విధించేలా చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

చట్ట సవరణ కోసం రాష్ట్రపతికి నివేదించనున్నారు. అంతేగాక, చిన్నారులపై అత్యాచారాల కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది.

Cabinet makes child rapes punishable with death

ఇటీవల చిన్నారులపై జరిగిన అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే శిక్షలు మరింత కఠినంగా ఉండాలని బాధితుల కుటుంబసభ్యులు, ప్రజాసంఘలు, ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు చట్ట సవరణ చేసింది.

English summary
The Union Cabinet has cleared a law which prescribes capital punishment to those convicted of raping children below the age of 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X