arvind kejriwal aap aam aadmi party new delhi somnath bharti అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ సోమనాథ్ భారతి
రోడ్డు మీదే కేజ్రీవాల్ క్యాబినెట్, ఫైళ్ల క్లియరెన్స్ కూడా
న్యూఢిల్లీ: నగర పోలీసులకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రులు ధర్నా చేస్తుండడంతో రోడ్డు మీంచే ప్రభుత్వం నడుస్తోంది. మంత్రి వర్గ సమావేశాన్ని కూడా రోడ్డు మీదే నిర్వహించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది.
కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు మంత్రులు తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరసన పది రోజులకు మాత్రమే పరిమితం కాదని, ఆ తర్వాత కూడా కొనసాగుతందని చెబుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని రైల్ భవన్ వెలుపల నడుస్తోంది.

రోడ్డు మీదే అరవింద్ కేజ్రీవాల్ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని, రోడ్డు మీదే మంత్రి వర్గ సమావేశం కూడా నిర్వహిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ యోగేంజ్ర యాదవ్ చెప్పారు. దాదాపుగా మంత్రులు ధర్నాలోనే కూర్చుకుంటున్నారు.
సోమవారంనుంచి కేజ్రీవాల్‌తో పాటు మంత్రులు కూడా ఫైళ్లను రోడ్డు మీదే పరిశీలిస్తున్నారు. మంత్రుల చుట్టూ పెద్ద యెత్తున ప్రజలు, మద్దతుదారులు, పోలీసులు ఉన్నారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసే వరకు తమ ధర్నా కొనసాగుతుందని కేజ్రీవాల్ మంగళవారం ఉదయం చెప్పారు.