వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిని తగ్గిచేందుకే: జైలు శిక్షను ఏడేళ్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లంచం కేసులను క్రూరమైన నేరాల జాబితాలో చేర్చుతూ, లంచం తీసుకునే అధికారులకు విధిస్తున్న ఐదేళ్ల జైలు శిక్షను ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా అవినీతి వ్యతిరేక చట్టంలో చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

తాజా సవరణలతో 1988నాటి అవినీతి వ్యతిరేక చట్టానికి రెక్కలొచ్చాయి. దీంతో లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరంగానే పరిగణిస్తారు. గతంలో లంచం తీసుకున్న కేసుల్లో ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేవారు. ఇప్పుడు పరిమితిని ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Cabinet okays increasing penalty for corruption to maximum 7 years

అంతేకాదు అవినీతి కేసులకు త్వరగా ముగించడంతో పాటు, రెండు సంవత్సరాల కాలపరిమితిని విధించింది. గత నాలుగు సంవత్సరాల్లో పీసీ చట్టం కింద అవినీతి ట్రయిల్ కేసులు ఎనిమిది సంవత్సరాలుగా ఉండేది. తాజా సవరణలతో విచారణను రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి అందించాలని ప్రతిపాదించింది.

దేశంలో అవినీతి తగ్గించేందుకు గాను 2013 నుంచి రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

English summary
Bringing corruption into the heinous crime category, the Union Cabinet today approved official amendments to an anti-graft legislation enhancing the penalty under it to a maximum of seven years imprisonment from the present five years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X