• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాఫీ డే సిద్దార్థ బీజేపీ ఐటీ దాడులకు బలి అయ్యారా?: ఎస్ఎం కృష్ణ పార్టీ ఫిరాయింపు అల్లుడి కోసమేనా?

|

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపక అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ భౌతిక కాయం చుట్టూ రాజకీయాలు అలముకున్నాయి. భౌతిక కాయం కేంద్రబిందువుగా చేసుకుని కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. ఓ పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి బీజేపీ పరిపాలన దిగజారిందంటూ కాంగ్రెస్ దాడి చేస్తోంది. తమ హయాంలో నీతి, నిజాయితీగా ఎదిగిన పారిశ్రామికవేత్తల ఆర్థిక స్థితిగతులు.. బీజేపీ పరిపాలనలో దిగజారిపోయాయని విమర్శిస్తోంది. ప్రస్తుతం బీజేపీ అగ్ర నేతల దృష్టి అంతా ఆదాయపు పన్ను, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్, సీబీఐ అధికారుల దాడులపై మాత్రమే ఉందని ధ్వజమెత్తుతోంది.

VG Siddartha Missing: దొరికిన సిద్ధార్థ భౌతిక కాయం! బ్రిడ్జి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో..

అల్లుడి కోసమే ఎస్ఎం కృష్ణ పార్టీ ఫిరాయించారా?

అల్లుడి కోసమే ఎస్ఎం కృష్ణ పార్టీ ఫిరాయించారా?

వీజీ సిద్ధార్థ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు. సిద్ధార్థ భార్య మాళవిక కృష్ణ హెగ్డే.. స్వయానా ఎస్ఎం కృష్ణ కుమార్తె. ఎస్ఎం కృష్ణ ఆరంభం నుంచీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రివర్గంలో కొనసాగారు. విదేశాంగం వంటి కీలక శాఖకు మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆ తరువాత ఎస్ఎం కృష్ణ బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. అదే పార్టీలో కొనసాగుతున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత పారిశ్రామికవేత్తలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలు పెట్టింది. కాంగ్రెస్ కు ఆర్థికంగా అండదండగా ఉంటూ వచ్చిన బడా పారిశ్రామికవేత్తలపై బీజేపీ నాయకులు ఐటీని ప్రయోగించారనే విమర్శలు ఈనాటికి కావు. వీజీ సిద్దార్థ సైతం ఈ దాడుల బారిన పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే.. ఎస్ఎం కృష్ణ అయిష్టంగా బీజేపీలో చేరారని అంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు. అయినప్పటికీ.. ఐటీ అధికారుల వేధింపులు తప్పలేదని చెబుతున్నారు.

పారిశ్రామికవేత్తలకు ఊపిరిపోశాం..

పారిశ్రామికవేత్తలకు ఊపిరిపోశాం..

యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా పారిశ్రామికరంగం వెలుగులను విరజిమ్మిందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ, కార్తి చిదంబరం అన్నారు. మేకిన్ ఇండియా అనే నినాదాన్ని నెత్తినెత్తుకున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల జీవితాలను చీకట్ల మయం చేసిందని ధ్వజమెత్తారు. పరిశ్రమలు, పెట్టుబడులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం.. వారికి భిన్నమైన నిర్ణయాలను తీసుకుంటోందని అన్నారు. తమ మాట వినని, తమ పార్టీలో చేరని పారిశ్రామికవేత్తలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా పని చేయాల్సిన సీబీఐ, ఈడీ, ఐటీ వంటి శాఖలు బీజేపీ ఏర్పాటు చేసిన పంజరంలో చిక్కుపోయాయని విమర్శించారు. బీజేపీ పెద్దల కనుసైగల్లో పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. దీనికి ఉదాహరణే- వీజీ సిద్ధార్థ ఆత్యహత్య ఉదంతమని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో వెలుగు వెలిగిన పరిశ్రమలు ఎన్డీఏ ప్రభుత్వం బారిన పడి మూత పడుతున్నాయని విమర్శించారు.

మంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టెమ్

మంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టెమ్

నేత్రావతి నది ఒడ్డున వీజీ సిద్ధార్థ భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే పోలీసులు దాన్ని మంగళూరులోని వెన్ లాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టమ్ నివేదికలోని వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ తెల్లవారు జామున 6:30 గంటల సమయంలో ముగ్గరు మత్స్యకారులు తొలుత ఈ భౌతిక కాయాన్ని చూశారు. నీటిలో తేలియాడుతూ భౌతిక కాయం కనిపించిన వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేత్రావతి బ్రిడ్జి నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దీన్ని గుర్తించారు. అనంతరం- కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సిద్ధార్థ ఇక లేడనే సమాచారం.. ఎస్ఎం కృష్ణ నివాసంలో విషాదాన్ని నింపింది. సిద్ధార్థ భార్య, ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవికా కృష్ణ హెగ్డె, కుమారుడు ఆమర్త్య హెగ్డే శోకసముద్రంలో మునిగిపోయారు.

చిక్ మగళూరులో అంత్యక్రియలు..

చిక్ మగళూరులో అంత్యక్రియలు..

కర్ణాటకలోని చిక్ మగళూరులో వీజీ సిద్ధార్థ అంత్యక్రియలను నిర్వహించబోతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళూరులోని వెన్ లాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టమ్ పూర్తయిన తరువాత నేరుగా భౌతిక కాయాన్ని చిక్ మగళూరుకు తీసుకెళ్లనున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తెలియ రాలేదు. సిద్ధార్థ మృతదేహం డీ కంపోజ్ స్థితిలో దొరికినందున.. ఎక్కువ రోజులు ఉంచకపోవచ్చని తెలుస్తోంది. సిద్ధార్థకు చెందిన 13 వేల ఎకరాల తేయాకు ఎస్టేట్ లో అంత్యక్రియలను నిర్వహించవచ్చని చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MP Manish Tewari says VG Siddhartha committed suicide because of harassment. He says, Very Very tragic what happened. Manish Tiwari Allegedly Harassed and hounded to commit Suicide by among others a yet unnamed DG of the Income Tax going by the document in the public space. May his soul rest in peace, He added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more