వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాఫీ డే కింగ్ సిద్దార్థ సంతకంలో తేడా, లేఖపై అనుమానాలు, వైరల్, డీకేశి. కిరణ్ మంజూదార్ షా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ అదృశ్యం కేసు గంటకో మలుపు తిరుగుతోంది. సిద్దార్థ తన కంపెనీ ఉద్యోగులకు రాశారు అంటున్న లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సిద్దార్థ రాశారు అంటున్న లేఖలోని సంతకం విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వ్యాపారంలో నేను విఫలం అయ్యాను, స్నేహితుడు, ఓ ఐటీ శాఖ మాజీ అధికారి తన మీద ఒత్తిడి చేస్తున్నారని, లావాదేవీలు చూసుకోవడం సాధ్యంకాని పరిస్థితి ఎదురైయ్యిందని జులై 27వ తేదీ సిద్దార్థ ఆయన కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారని ఓ లేఖ సోషల్ మీడియాలో ఉంది.

Cafe Coffee Day VG Siddhartha signature in letter is different from original signature

సిద్దార్థ రాశారు అంటున్న లేఖను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన సంతకంలో తేడా ఉందని వెలుగు చూసింది. సిద్దార్థ కీలక పత్రాల్లో చేసిన సంతకం, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న లేఖలోని సంతకంలో తేడా ఉందని వెలుగు చూసింది.
సోషల్ మీడియాలో ఉన్న లేఖలో సిద్దార్థ సంతకం చేశారని ఉంది.

అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే సంతకంలో తేడా ఉన్న విషయం వెలుగు చూసింది. ఆందోళనగా ఉన్న సమయంలో ఆత్రుతతో సిద్దార్థ ఏమైనా పొరపాటున సంతకం చేశారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ సైతం సోషల్ మీడియాలో ఉన్న లేఖలోని సంతకం విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లేఖలో జులై 27వ తేదీ అని ఉంది. డీకే. శివకుమార్ కు జులై 28వ తేదీ సిద్దార్థ ఫోన్ చేశారు. తనకు ఫోన్ చేసిన సమయంలో సిద్దార్థ బాగానే మాట్లాడారని, ఆయన మాటల్లో ఆందోళన లేదని డీకే. శివకుమార్ అంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, బయోకాన్ చీఫ్ కిరణ్ మంజూదార్ షా సైతం సిద్దార్థ అదృశ్యం అయిన విషయంలో, ఆయన సంతకం విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A letter is circulating as Siddharth's which wrote to his employees. But the signature of the letter is creating doubts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X