వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు జడ్జీలకు ఐదేళ్ల శిక్ష విధించిన జస్టిస్ కర్ణన్

కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్‌ కర్ణన్‌ సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ సహా ఏడుగురు జడ్జిలకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. కర్ణన్ సంచలన తీర్పుతో ఒక్కసా

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్‌ కర్ణన్‌ సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

కర్ణన్ సంచలన తీర్పుతో ఒక్కసారిగా న్యాయవ్యవస్ధ షాక్‌కు గురైంది. సీజేఐతో పాటు మరో ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కర్ణన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌-1989, 2015ల కింద వీరికి శిక్షను విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

justice Karnan

ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల పాటు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. కుల వివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగాజస్టిస్ కర్ణన్ వ్యాఖ్యానించారు. జరిమానాను వారం రోజుల్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చెల్లించాలని పేర్కొన్నారు.

కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తికి(అంటే కర్ణన్‌కు) చెల్లించాల్సిన రూ.14 కోట్ల పరిహారం ఇంకా అందలేదని, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆ డబ్బును జడ్జిల వేతనాల్లో నుంచి తీసుకుని అకౌంట్‌లో వేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ కర్ణన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఏడు జడ్జిలతో కూడిన బెంచ్‌ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్‌ పేర్కొన్నారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే.

English summary
Calcutta high court judge C S Karnan Monday evening ordered five-year rigorous imprisonment and a fine of rupees one lakh each for Chief Justice of India J S Khehar and seven other judges of the Supreme Court as “punishment for offences punishable under the Scheduled Caste/Scheduled Tribe Atrocities Act 1989 and Amended Act of 2015.” If the judges failed to pay the fine, they would have to serve jail sentence for six more months. Stating that “the judges had shown caste discrimination and hence had no locus standi to continue as Supreme Court judges, the order said that the fine amount has to be paid within a week to the National Commission, Scheduled Caste and Scheduled Tribes Constitutional body, at Khan Market, New Delhi.” The order directed the Commissioner of Delhi Police to execute the order. “The accused are at liberty to approach Parliament,” it added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X