వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుది అంకానికి చేరిన సార్వత్రిక సమరం.. నేటితో ముగియనున్న చివరి విడత ప్రచారం

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి నేటితో తెర పడనుంది. 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు సాయంత్రానికి రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముగించనున్నాయి. బెంగాల్‌లో ఘర్షణల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే ప్రచారం ముగిసింది. గురువారం రాత్రి 10 గంటలకు క్యాంపెయినింగ్‌కు ఫుల్‌స్టాప్ పడింది. చివరి విడతలో పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో 918మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

యూపీయేతర పక్షాలకు సోనియా ఆహ్వానం అబద్ధం, 23 తర్వాతే నిర్ణయంయూపీయేతర పక్షాలకు సోనియా ఆహ్వానం అబద్ధం, 23 తర్వాతే నిర్ణయం

తదివిడత ప్రచారానికి చివరి రోజు కావడంతో రాజకీయ నాయకులంతా క్యాంపెయినింగ్‌లో జోరు పెంచారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొంటూ ఓటర్లతో మమేకమవుతున్నారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఖర్గోన్‌లో జరిగే ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో జరగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని మిర్జాపూర్‌, ఖుషీ నగర్‌లలో రోడ్ షో నిర్వహించనున్నారు. బీఎస్పీ చీఫ్ మాయావతి సైతం మిర్జాపూర్‌లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

Campaigning for final phase of LS elections ends this evening

ఉత్తర్ ప్రదేశ్‌లో కీలకమైన పూర్వాంచల్‌ ప్రాంతంలో తుది విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ దఫా యూపీ, పంజాబ్‌లో 13 చొప్పున, బెంగాల్‌లో 9, బీహార్, మధ్య ప్రదేశ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక్క స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పోటీ చేస్తున్న వారణాసి స్థానానికి ఈ దశలోనే ఎన్నిక నిర్వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఈ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై 3,71,784 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మే 19న చివరి దశ ఎన్నిక పూర్తి కానుండగా.. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
Campaigning for the seventh and final phase of Lok Sabha polls in 59 constituencies spread over six states and one union territory elections will come to an end this evening. In West Bengal, campaigning in the remaining nine constituencies ended last night, a day ahead of the scheduled closing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X