వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటితో ముగియనున్న బీహర్ ప్రచారం: నితీశ్ కుమార్, స్మృతీ ఇరానీ, జేపీ నడ్డా ర్యాలీ..

|
Google Oneindia TeluguNews

బీహర్ ఎన్నికల తొలి విడత ప్రచారం పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలతో క్యాంపెయిన్ పూర్తవుతోంది. ఈ నెల 28వ తేదీ బుధవారం మొదటి విడత 71 నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. రెండో విడత నవంబర్ 3వ తేదీన 94 సీట్లలో, మూడో విడత నవంబర్ 7వ తేదీన 78 సీట్లకు ఎన్నికలు జరగడంతో.. ప్రక్రియ ముగియనుంది. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.

Recommended Video

Bihar Polls 2020 : మరోసారి Nitish Kumar కు పట్టం కట్టబోతున్న బీహర్ ప్రజలు.. ABP సర్వే వెల్లడి!

మరికొన్ని గంటల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ముగియనుండటంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఇవాళ బీహర్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీలలో ప్రసంగిస్తారు. అయితే ఏబీపీ సీ ఓటర్ సర్వే మాత్రం నితీశ్ కుమార్ కూటమి విజయం సాధిస్తోందని తెలిపారు. సీఎంగా నితీశ్‌ను 29.5 శాతం మంది అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఆయన వెనకాలే తేజస్వీ యాదవ్ ఉన్నారు. ఆయనకు 19.9 శాతం మంది ప్రజల మద్దతు ఉండగా.. చిరాగ్ పాశ్వాన్‌కు కూడా 13.8 శాతం మంది మద్దతు ఇస్తున్నారు.

Campaigning for Phase 1 of bihar Polls Ends Today..

గత 15 ఏళ్లుగా పాలిస్తోన్న నితీశ్ కుమార్ బీహర్ అభివృద్దిని మరిచారని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్నీ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా సూఫీ, సున్నీలకు మేలు కలుగజేస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై చిరాగ్ పాశ్వాన్ డాక్యుమెంట్ కూడా విడుదల చేశారు.

English summary
campaigning for phase 1 of the Bihar elections draws to a close today ahead of the voting on October 28
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X