• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

BCG వ్యాక్సిన్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? పరిశోధనలు ఏం తేల్చాయి..?

|

ముంబై: కరోనావైరస్‌కు విరుగుడు బీసీజీ వ్యాక్సినేనా..? ప్రపంచం మొత్తం కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా బీసీజీ వ్యాక్సిన్‌తో కరోనాను అంతమొందించొచ్చు అని వస్తున్న వార్తల్లో నిజముందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనావైరస్‌ను బీసీజీ వ్యాక్సిన్‌తో చెక్‌ పెట్టొచ్చని అమెరికాకు చెందిన రీసెర్చ్ పేపర్ ఒకటి వెల్లడించింది. కరోనావైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా బీసీజీ వ్యాక్సిన్ పనిచేస్తుందని పేర్కొంది.

  COVID-19 : హైదరాబాద్ హెటిరో నుంచి అందుబాటులోకి వచ్చిన కరోనా వైరస్ మెడిసిన్! || Oneindia Telugu
   బీసీజీ వినియోగిస్తున్న దేశాల్లో కనిపించని వ్యాప్తి

  బీసీజీ వినియోగిస్తున్న దేశాల్లో కనిపించని వ్యాప్తి

  సైన్స్ అడ్వాన్సెస్ అనే మెడికల్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఈ పేపర్ ... బాసిలస్ కాల్‌మెట్‌ గెరిన్ (బీసీజీ) అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపించడంలేదంటూ తన పరిశోధనల్లో తేలినట్లు తెలిపింది. అంతేకాదు అక్కడ మరణాలు సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు చెప్పింది. ఒక వేళ కొన్ని దశాబ్దాల నుంచి బీసీజీ వ్యాక్సిన్ వినియోగించినట్లయితే మార్చి 29 నాటికి అమెరికాలో కోవిడ్-19 మరణాలు కేవలం 468 మాత్రమే ఉండేవని పేర్కొంది. కానీ మార్చి 29 నాటికి వాస్తవ మరణాల సంఖ్య 2,467గా ఉన్నిందని వెల్లడించింది. భారత్ చైనా లాంటి దేశాలు నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో బీసీజీని అమలు చేశాయి కనక అక్కడ కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉన్నిందని ఆ పేపర్ పేర్కొంది. కొంతమంది వైద్యులు కూడా బీసీజీ వల్లే కరోనావైరస్ వ్యాప్తి తక్కువగా ఉందనే వాదనతో ఏకీభవిస్తున్నారు.

  మరి భారత్ చైనా లాంటి దేశాల్లో పరిస్థితేంటి..

  మరి భారత్ చైనా లాంటి దేశాల్లో పరిస్థితేంటి..

  టీబీ ఇతరత్ర వ్యాధుల నుంచి వ్యాధి నిరోధక శక్తి పెచేందుకు అప్పుడే పుట్టిన బిడ్డలకు 15 రోజుల్లోగా బీసీజీ వ్యాక్సిన్‌ను ఇవ్వడం జరుగుతుంది. 8 నెలల క్రితం ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడం మొదలు పెట్టిన నాటినుంచే బీసీజీ వ్యాక్సిన్‌కు దీన్ని నియంత్రించగలిగే శక్తి ఉందా అనే చర్చ ప్రపంచ దేశాల్లో జరిగింది. కరోనావైరస్ బయటపడ్డ తొలి 30 రోజుల్లో రోజువారీగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో అనే అంశంపై 135 దేశాల్లో స్టడీ చేయగా అదే సమయంలో ఎంతమంది మృత్యువాత పడ్డారో 134 దేశాల డేటాపై స్టడీ చేసింది. అయితే బీసీజీ తప్పనిసరిగా అమలు చేస్తున్న దేశాల్లో చూస్తే కరోనా వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు రీసెర్చ్‌లో తేలింది.

  అయితే బీసీజీతోనే కరోనా అంతమవుతుంది అని మాత్రం కచ్చితంగా చెప్పలేమని స్టడీ స్పష్టం చేసింది. ఇందుకు ఉదాహరణ భారత్ బ్రెజిల్ లాంటి దేశాల్లో బీసీజీ అమలు చేస్తున్నారు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ రెండు దేశాల్లో పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని చెప్పారు ప్రజాఆరోగ్య నిపుణులు డాక్టర్ అనంత్ భాన్.

   నిపుణుల వాదన ఏంటి..?

  నిపుణుల వాదన ఏంటి..?

  బీసీజీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అదే సమయంలో కరోనావైరస్ నియంత్రణలో కూడా కీలకంగా వ్యవహరిస్తుందని ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ డీన్‌ డాక్టర్ శషాంక్ జోషి చెప్పారు. అంతేకాదు బీసీజీ అమలు చేసే పోర్చుగల్ దేశంలో కరోనా వైరస్ కేసులు తక్కువగా నమోదు కాగా అదే బీసీజీ అమలు కాని దాని పొరుగుదేశం స్పెయిన్‌లో మాత్రం కేసులు విపరీతంగా పెరిగాయని డాక్టర్ శషాంక్ జోషి ఉదహరించారు.

  అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్న డాక్టర్ జోషి... మరోసారి బీసీజీ వ్యాక్సిన్‌ను ఇవ్వొచ్చా..? అనేది ఒక ప్రశ్నయితే, కాంప్లికేషన్స్‌ రాకుండా నివారించేందుకు కోవిడ్ పేషెంట్‌కు ఇవ్వొచ్చా అనేది రెండోది. ప్రస్తుతం బీసీజీ ఏమేరకు పనిచేస్తుందో అనేదానిపై ప్రభుత్వం ట్రయల్స్ నిర్వహిస్తోందని చెప్పారు. 250 మంది కోవిడ్ పేషెంట్లపై పరీక్షలు నిర్వహిస్తున్నారని మరో రెండుడ మూడు నెలల్లో దీనిపై ఒక క్లారిటీ వస్తుందని డాక్టర్ శషాంక్ జోషి చెప్పారు.

  English summary
  The debate over the anti-tuberculosis vaccine’s ability to protect against Covid-19 got a fresh lease with an American research paper stating that the BCG ‘slows down’ the infection’s spread within the community—at least in the first 30 days.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X