వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ సెక్స్ ద్వారా సంక్రమిస్తుందా..? తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సెక్స్ ద్వారా కూడా సంక్రమిస్తుందా..? తాజా పరిశోధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా..? చైనీస్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సెక్స్‌-కరోనా మధ్య లింకును ఇంకా నిర్దారించనప్పటికీ.. స్వల్ప అవకాశం లేకపోలేదని అధ్యయనంలో తేలింది. అయితే పురుషులకు సంబంధించి మరిన్ని వీర్యపు శాంపిల్స్‌ను టెస్టు చేస్తే తప్ప ఈ విషయాన్ని కచ్చితంగా నిర్దారించలేమని పరిశోధకులు తెలిపారు.

 కరోనా విలయం: తెల్ల జాతీయుల కంటే నల్ల జాతీయులపై ప్రభావం ఎక్కువ, నాలుగు రెట్ల మరణాలు.. కరోనా విలయం: తెల్ల జాతీయుల కంటే నల్ల జాతీయులపై ప్రభావం ఎక్కువ, నాలుగు రెట్ల మరణాలు..

తాజా పరిశోధన వివరాలు..

తాజా పరిశోధన వివరాలు..

చైనీస్ శాంగ్‌క్వియు వైద్యుల పరిశోధన ప్రకారం.. కరోనా వైరస్ సోకిన 38 మంది పురుషుల వీర్యాన్ని పరీక్షించారు. ఇందులో ఆరుగురి వీర్యంలో వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆ ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. ఇద్దరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే తక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించిందునా.. సెక్స్ కారణంగా కరోనా వ్యాప్తి చెందుతుందా అన్న విషయాన్ని ఇప్పుడే నిర్దారించలేమన్నారు. దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పుడే ఒక అంచనాకు రాలేము..

ఇప్పుడే ఒక అంచనాకు రాలేము..

జామా నెట్‌వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. ఒకవేళ కరోనా వైరస్ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ అయితే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని పరిశోధకులు తెలిపారు. అయితే కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మరికొన్ని చిన్న అధ్యయనాల్లో కరోనా పేషెంట్ల వీర్యంలో వైరస్‌ గుర్తించబడలేదు. కాబట్టి తాజా చైనీస్ పరిశోధనపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని చెప్పారు.

Recommended Video

Liquor Shops Reopen : Public Opinion On Liquor Price Hike | Oneindia Telugu
ఇతర దేశాల వైద్యులు ఏమంటున్నారు..

ఇతర దేశాల వైద్యులు ఏమంటున్నారు..

బ్రిటన్‌లోని షెఫీల్డ్‌కి చెందిన ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పాసే కూడా ఈ పరిశోధనపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమన్నారు. వీర్య కణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించడంలో టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. అంతేకాదు,వీర్యంలో గుర్తించిన కరోనా వైరస్ మరొకరికి వ్యాప్తి చెందేంత యాక్టివ్‌గా ఉందా లేదా అన్న దానిపై స్పష్టత లేదన్నారు. వీర్యంలో కరోనా వైరస్ ఉండటంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో విజృంభించిన జికా,ఎబోలా వైరస్‌లను కూడా వీర్య కణాల్లో గుర్తించారని గుర్తుచేశారు. బెల్‌ఫాస్ట్ క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన షీనా లూయిస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తాజా పరిశోధన చాలా చిన్నదని.. ఈ విషయాన్ని నిర్దారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని చెప్పారు. అలాగే పురుషుల సంతాన సామర్థ్యంపై కోవిడ్-19 దీర్ఘకాల ప్రభావాన్ని ఇంకా నిర్దారించాల్సి ఉందన్నారు.

English summary
The virus that causes Covid-19 can be found in semen, Chinese researchers report in a small study that doesn’t address whether sexual transmission is possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X