వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏపై ఇటాలియన్ అనువాదం కావాలా..? చట్టం చదివారా..? రాహుల్ గాంధీకి అమిత్ షా సెటైర్లు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సీఏఏను సమర్థిస్తూ తీసిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. పనిలోపనిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. పౌరసత్వ సవరణ చట్టం చదివారా ? లేదంటే ఇటాలియన్ ట్రాన్స్‌లేటర్ పెట్టాలా అని సెటైర్లు విసిరారు.

వెనక్కి తగ్గబోం..

వెనక్కి తగ్గబోం..

దేశంలో ఉన్న విపక్షాలన్నీ ఒక్కటైన సీఏఏపై వెనక్కి తగ్గబోమని అమిత్ షా స్పష్టంచేశారు. సీఏఏపై ఇప్పటికే తప్పుడు ప్రచారం చేశారని, కావాలంటే మరింత ప్రచారం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ కూడా విసిరారు.

ట్రాన్స్‌లేటర్ కావాలా..?

ట్రాన్స్‌లేటర్ కావాలా..?


పౌరసత్వ సవరణ చట్టం చదివి, అర్థం చేసుకుంటే తనతో చర్చకు సిద్ధమా అని రాహుల్‌గాంధీని అడిగారు. ఒకవేళ చట్టాన్ని చదవకుంటే, చదవలేకపోతే.. ‘లా' కు సంబంధించి ఇటాలియన్ ట్రాన్స్‌లేటర్ కావాలంటే సమకూరుస్తానని అమిత్ షా సెటైర్లు విసిరారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు.. పౌరసత్వ సవరణ చట్టాన్ని చదవాలని కోరారు.

ఓటుబ్యాంకు రాజకీయాలే..

ఓటుబ్యాంకు రాజకీయాలే..

దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని అమిత్ షా విమర్శించారు. దానికి నిదర్శనమే వీర్ సవార్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు అని ఉదహరించారు. అలా కామెంట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకు శరం లేదా అని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హిందు, పర్షీ, జైన్, సిక్కు, క్రిస్టియన్లకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని పేర్కొన్నది. ఇందులో శరణార్థ ముస్లింలను విస్మరించడంతో దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. సీఏఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, పౌరులు కూడా గత కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు.

గౌరవంగా జీవించొచ్చు

గౌరవంగా జీవించొచ్చు


దేశంలో మైనార్టీలు గౌరవంగా జీవించొచ్చు అని అమిత్ షా పేర్కొన్నారు. ఒకరి పౌరసత్వాన్ని హరించి చట్టం.. సీఏఏలో లేదని అమిత్ షా తెలిపారు. కానీ కొందరికీ పౌరసత్వం అమలుచేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించినట్టు పరోక్షంగా అంగీకరించారు. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా అమిత్ షా ఇలానే వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టతనిచ్చారు.

English summary
all these parties come together, BJP will not move back even an inch on this issue of Citizenship Amendment Act Amit Shah said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X