వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ అంటే ఏమిటి..? మలేరియా మందు కరోనాకు వినియోగించొచ్చా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి పై పోరుకు చికిత్స ఉందా లేదా అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే పలుదేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు క్లినికల్ ట్రయల్స్‌ కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలోనే మహమ్మారికి విరుగుడు హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ అనే చిన్న మాత్ర అనే వార్త బయటకు రావడంతో ఈ డ్రగ్‌కు యమ క్రేజ్ లభిస్తోంది. సాక్షాత్తు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడే ఈ డ్రగ్‌ను అమెరికాకు సరఫరా చేయాలంటూ ప్రధాని మోడీని అగడటం చూస్తే ఈ సమయంలో ఈ మత్ర ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఏమిటి..?

 హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ అంటే ఏమిటి..?

హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ అంటే ఏమిటి..?

హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ అమెరికాకు సరఫరా చేయకపోతే కచ్చితంగా భారత్ తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయగానే భారత్ ఓ మెట్టు దిగొచ్చి అమెరికాకు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో రాజకీయాలు చేయొద్దని కూడా భారత్ కోరింది. ఇక హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ మలేరియా నివారణకు తీసుకునే మెడిసిన్. అయితే ఈ మెడిసిన్ కరోనావైరస్‌ను నయం చేయగల శక్తి ఉందా.. ఒకవేళ ఉంటే అది నిజంగానే ఈ సమయంలో వరం అనే భావించాలి.

 మలేరియాతో పాటు ఇతర చికిత్సల్లో కూడా..

మలేరియాతో పాటు ఇతర చికిత్సల్లో కూడా..

మలేరియా చికిత్సలో భాగంగా హైడ్రాక్సిల్ క్లోరోక్విన్‌ను వినియోగిస్తారు. దీన్ని రెండో ప్రపంచయుద్ధం సమయంలో కనుగొన్నారు. కీళ్ల నొప్పులు లేదా ఆర్థ్రిటిస్ చికిత్సకు కూడా ఈ మెడిసిన్‌ను వినియోగిస్తారు. అంతేకాదు హైడ్రాక్సిల్ క్లోరోక్విన్‌తో కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మం సంబంధిత వ్యాధులు, గుండెసంబంధిత వ్యాధులు, జ్వరం వంటివి కూడా నియంత్రణలోకి వస్తాయని తమ పరిశోధనల ద్వారా తేలిందని చెప్పారు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లూపస్ సెంటర్ పరిశోధకులు. హైడ్రాక్సి క్లోరోక్విన్ ప్లాకెనిల్ అనే బ్రాండ్ పేరుతో మెడికల్ షాపుల్లో లభిస్తుంది.

 దీన్ని వినియోగించడం సురక్షితమేనా...?

దీన్ని వినియోగించడం సురక్షితమేనా...?

కరోనావైరస్ పేషెంట్లను కేర్ తీసుకుంటున్న మెడికల్ సిబ్బందికి హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ మెడిసిన్‌ను ఇవ్వాల్సిందిగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ భార్గవ సూచించారు. అంతేకాదు కరోనాపాజిటివ్ నిర్థారణ జరిగిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ మెడిసిన్‌ను ఇవ్వాల్సిందిగా సూచించారు. అయితే ఇది ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే వినియోగించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. టాస్క్‌ఫోర్స్‌ వాదనతో ఏకీభవించారు మరో సైంటిస్ట్. అయితే ఈ డ్రగ్‌తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్పారు. వీటిలో హార్ట్ బ్లాక్, హార్ట్ రిథిమ్ డిస్ట్రబెన్సెస్, డిజినెస్, గిడ్డినెస్, నాసియా, వాంతులు, డయారియా వంటివి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మార్చి నెలలో ఆరిజోనాలో క్లోరోక్విన్ తీసుకుని ఒక వ్యక్తి మృతి చెందగా అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది.

 కరోనావైరస్‌ చికిత్సకు హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఇవ్వొచ్చా..?

కరోనావైరస్‌ చికిత్సకు హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఇవ్వొచ్చా..?

ఫ్రాన్స్‌లో 40 మంది కరోనావైరస్ పేషెంట్లకు హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఇవ్వడం జరిగింది. ఇందులో సగం మందికి పైగా ఊపిరితిత్తుల్లో వైరస్ మాయమైంది. ఇది మూడు నుంచి ఆరో రోజుల్లో జరిగింది. అంటే వైరస్ శరీరంలోని ఇతర కణాల్లోకి ప్రవేశించకుండా హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఒకింత వరకు అడ్డుకుంటుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. మరోవైపు చైనాలో ఓ వ్యక్తికి హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఇవ్వగా పెద్దగా మార్పు కనిపించలేదని మరో నలుగురిలో మాత్రం లివర్ డ్యామేజ్‌తో పాటు డయేరియా వచ్చిందని అంతర్జాతీయ పత్రిక గార్డియన్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ డ్రగ్ కరోనాకు ఇచ్చే ముందు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని సూచిస్తున్నారు. అయితే కరోనావైరస్ పేషెంట్లకు ఎమర్జెన్సీ అయితే తప్ప హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఇవ్వరాదని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సూచిస్తోంది.

English summary
Hydroxychloroquine is used to treat malaria. The drug was invented during World War II. It is also prescribed for rheumatoid arthritis. Hydroxychloroquine is sold under the brand name Plaquenil and is available as generics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X