వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషులు అత్యాచారంలో మీ అభిప్రాయం? కేంద్రాన్ని అడిగిన ఢిల్లీ హైకోర్టు!

పురుషులు అత్యాచారానికి గురైతే ఫిర్యాదు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉందని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పురుషులు అత్యాచారానికి గురైతే ఫిర్యాదు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉందని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఐపీసీ 375, 376 సెక్షన్లు పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని, మహిళలను ఇవి అపరాధులుగా చేర్చడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు.

దీనిపై జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్‌ కేం‍ద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత చట్ట నిబంధనలు మహిళను అత్యాచార బాధితురాలిగా, పురుషుడిని కేవలం నిందితుడిగా గుర్తిస్తున్నాయని.. లైంగిక హింస నేపథ్యంలో జెండర్‌ ఆధారంగా నేరాన్ని ఎలా అర్థం చేసుకుంటారని పిటిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Can Only Men Rape Women? Delhi HC Issues Notice to Centre on PIL Seeking Gender-Neutral Rape Laws

పితృస్వామ్య సమాజంలో పురుషులు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు మెదపలేకపోతున్నారని, మగాళ్లపై అత్యాచార ఘటనలు చాలా తక్కువే అయినా వాటిని విస్మరించలేమని అన్నారు. పురుషులు ఎవరైనా తమపై అత్యాచారం జరిగిందనే ఫిర్యాదు చేస్తే అతడిని సమాజం నిజమైన మగాడిగా గుర్తించదని వాపోయారు.

రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, లింగ ఆధారంగా వివక్షను వ్యతిరేకించే ఆర్టికల్‌ 15 ప్రకారం మహిళలకు ఉండే హక్కులే పురుషులకూ వర్తించాలన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై న్యాయస్థానం అక్టోబర్‌ 23న విచారణ జరపనుంది.

English summary
A bench of Acting Chief Justice of the Delhi High Court Gita Mittal and Justice C Hari Shankar has issued notice to the Centre on a Public Interest Litigation challenging the constitutionality of Section 375 and 376 of the Indian Penal Code as being biased towards men and not including women under its ambit as the perpetrators. Sanjiv Kumar, the petitioner, has challenged the constitutionality of the existing provisions that deal with rape as they recognizes only a man as the perpetrator and the woman as a victim. Kumar has contended that critics have failed to recognize the importance of gender-neutral laws and has urged the bench to think “beyond the male-on-female paradigm.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X