• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘చౌకీ దార్ ఛోర్ హై’: దోషిగా తేలితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడుతుందా?

|

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధిక్కార కేసులో సుప్రీంకోర్టు ఈ వారం కీలక తీర్పును వెలువరించనుంది. రాహుల్ గాంధీ భేషరతుగా క్షమాపణలు కోరినప్పటికీ.. సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? లేదా అనే విషయం తేలిపోనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం బీజేపీ నేత మీనాక్షి లేఖి రాహుల్ గాంధీపై దాఖలు చేసిన క్రిమినల్ ధిక్కార పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది.

నిబంధనల ప్రకారం దోషిగా తేలిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి దూరంగా ఉండాలి లేదా ఎన్నికల్లో పోటీ చేయరాదు. ఒకవేళ ధిక్కార కేసులో దోషిగా తేలితే వాయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ తప్పుకోవాల్సి వస్తుంది లేదా అనర్హుడిగా ప్రకటించబడతారా? అనేది తేలనుంది. అసలు చట్టం ఏం చెబుతుందో ఓసారి పరిశీలిద్దాం.

అత్యంత నిజాయితీపరుడు ఆయనే: బీజేపీ ఎమ్మెల్యేపై రాహుల్, అలా ఎందుకన్నారంటే..?

ఎప్పుడు ఒక అభ్యర్థి అనర్హుడిగా ప్రకటించబడతారా?

ఎప్పుడు ఒక అభ్యర్థి అనర్హుడిగా ప్రకటించబడతారా?

1951 ఆర్.పీ. చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఏదైనా ఒక నేరం చేసిన వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే అతడు ఎన్నికల నుంచి అనర్హుడిగా ప్రకటించబడతాడు. దోషిగా తేలి బెయిల్‌పై లేదా పేరోల్‌పై విడుదలైనప్పటికీ అతడు లేదా ఆమె ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించబడతారు.

ధిక్కార చట్టం:

ధిక్కార చట్టం:

కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం సెక్షన్ 12 భారతదేశంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు శిక్షను విధిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా లేదా ఈ రెండింటినీ విధించవచ్చు. ఈ ప్రకారం రాహుల్ గాంధీ ఎన్నిక అనర్హతకు గురికాకపోవచ్చు. ఈ చట్టం ప్రకారం కేవలం 6 నెలల జైలు శిక్ష లేదా 180 రోజులు శిక్ష.. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రెండేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించినవారు మాత్రమే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించబడతారు.

సెక్షన్లు ఇలా..

సెక్షన్లు ఇలా..

1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ చట్టం సెక్షన్ 2(బీ) ప్రకారం సివిల్ కంటెంప్ట్ ఇలా నిర్వచించబడింది. ఏదైనా కోర్టు తీర్పును, డిక్రీని, ఆదేశాలను, మార్గదర్శకాలను, రిట్ లేదా ఇతర పక్రిక్రియను ఉద్దేశ పూర్వకంగా ధిక్కరిస్తే కోర్టులు శిక్షలను విధిస్తాయి.

1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ చట్టం సెక్షన్ 2(సీ) ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ఈ విధంగా నిర్వచించబడింది. పబ్లికేషన్(పదాలు, మాటలు, రాతపూర్వకంగా) లేదా సంకేతాల ద్వారా లేదా చూపుల ద్వారా లేదా ఇతర) ఏదైనా విషయం లేదా ఏదైనా చర్య ధిక్కారంగా ఉంటే..

1. అపకీర్తి లేదా అపవాదు లేదా ఏదైనా కోర్టు అధికారాన్ని తక్కువ చేయడం లేదా

2. ఏదైనా న్యాయపరమైన చర్యల పక్షపాతాలు లేదా జోక్యం చేసుకోవడం లేదా

3. న్యాయ పరిపాలనలో ఏ పద్ధతిలోనైనా జోక్యం చేయడం.. వ్యతిరేకించడం లాంటి విషయాలు.

రాహుల్ గాంధీ కేసు

రాహుల్ గాంధీ కేసు

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ‘చౌకీదార్ ఛోర్ హై' అంటూ ప్రచారం చేయడంపై బీజేపీ నేత మీనాక్షి లేఖి.. రాహుల్‌పై కంటెంప్ట్ పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. తప్పుగా సుప్రీంకోర్టుకు అపాదించారని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పేర్కొనని వ్యాఖ్యలు కూడా చెప్పినట్లుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు.

సుప్రీంకోర్టుకు అపవాదు

సుప్రీంకోర్టుకు అపవాదు

కాగా, ఇటీవల రఫేల్ డీల్‌పై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రఫెల్ ఒప్పందంపై గతంలో ఇచ్చిన తీరపును పున:సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లనపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్ ఆధారంగా కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న రాహుల్ గాంధీ ప్రధానిపై చౌకీదార్ ఛోర్ హై అంటూ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలా వ్యాఖ్యానించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు రాహుల్ పై మండిపడ్డారు. మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరించారంటూ, ధిక్కారానికి పాల్పడినట్లు సర్వోన్నన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పేర్కొనని వ్యాఖ్యలను వ్యాఖ్యానించినట్లు రాహుల్ గాంధీ అపవాదును తీసుకోచ్చారని తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court pronounce an important order this week with regard to the Rahul Gandhi contempt case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more