వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహజీవనంలో సెక్స్.. రేప్ కాబోదు -తప్పుడు వివాహ వాగ్ధానం నేరమే -సుప్రీంకోర్టు మరో సంచలనం

|
Google Oneindia TeluguNews

భారత్ లో మారుతోన్న జీవనశైలికి తగ్గట్లే కోర్టులు సైతం ప్రజల జీవన సంబంధాలపై కీలక తీర్పులు వెలువరుస్తున్నాయి. చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండానే, జంటగా కలిసుండే 'సహజీవన(లివ్ ఇన్ రిలేషన్) సంబంధాలు క్రమంగా పెరుగుతుండటం, దానికి అనుగుణంగా సహజీవనాలపై వివాదాలు, కేసులు కూడా పెరుగుతోన్న క్రమంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది..

viral video:రాహుల్ గాంధీ పాటవం -బీజేపీ బేరాల భయం -విజయన్ వ్యంగ్యాస్త్రంviral video:రాహుల్ గాంధీ పాటవం -బీజేపీ బేరాల భయం -విజయన్ వ్యంగ్యాస్త్రం

అది రేప్ కాదు..

అది రేప్ కాదు..

కొంతకాలం సహజీవనం చేసిన తరువాత, పురుషుడిపై స్త్రీలు అత్యాచార ఆరోపణల కేసులు పెడుతోన్న వైనాలు ఇటీవల కాలంలో పెరుగుతోన్న నేపథ్యంలో.. అలాంటిదే ఓ కేసు విచారణ సందర్భంగా సోమవారం అత్యున్నత న్యాస్థానం అనూహ్య వ్యాఖ్యలు చేసింది. సహజీవనంలో భాగంగా మహిళ అంగీకారంతో జరిపే సెక్స్ లేదా శారీరక సంబంధాలను తర్వాతి కాలంలో అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.

పెళ్లి ప్రామిస్ మాత్రం నేరమే

పెళ్లి ప్రామిస్ మాత్రం నేరమే

స్త్రీపురుషులు.. ఆర్థిక అవసరాల కోసమో, శారీరక సుఖాల కోసమో పరస్పర అంగీకారంతో సహజీవన సంబంధాన్ని ఏర్పర్చుకుంటే, వారి మధ్య లైంగిక చర్య.. అత్యాచారం కిందకు రాదని సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్ధానాలు చేయడం, పెళ్లి పేరుతో మహిళను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం మాత్రం ముమ్మాటికీ నేరమే అవుతుందని కోర్టు క్లారిటీ ఇచ్చింది.

ఇంతకీ ఏంటా కేసు?

ఇంతకీ ఏంటా కేసు?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సహజీవన జంటకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సీజేఐ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు జంట గతంలో ఓ రెండేళ్లపాటు లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అతనితో కలిసున్న సమయంలో ఆ మహిళ సెక్స్ ను నివారిస్తూ, పెళ్లి తర్వాతే అన్నీ అని చెబుతూ వచ్చింది. ఆ వ్యక్తిమాత్రం ఆమెను మోసపూరిత మాటలతో లోబర్చుకుకుని శారీరక వాంఛలు తీర్చుకున్నాడని, ఇంకా నమ్మకం కుదిరేలా మనాలీలోని ఓ గుడిలో రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించారు. దీనికి..

లివిన్‌లో అది తప్పు కాదు..

లివిన్‌లో అది తప్పు కాదు..

నిందితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. రెండేళ్ల పాటు వారు సహజీవనంలో ఉన్నమాట వాస్తవమేనని, అయితే, పెళ్లి ప్రామిస్ తర్వాతే శారీరకంగా కలిశామన్నది మాత్రం అవాస్తవమని పేర్కొన్నాడు. ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం.. "వివాహం గురించి తప్పుడు వాగ్దానాలు చేయడం నేరం. వివాహం, విడిపోవడం విషయాల్లో ఎవరూ తప్పుగా వాగ్దానం చేయకూడదు, కానీ సహజీవనంలో పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణనలోకి తీసుకోలేం" అని అభిప్రాయపడింది.

 కొడితే రేప్ కేసు పెడతారా?

కొడితే రేప్ కేసు పెడతారా?

సహజీవనంలో సెక్స్ ను రేప్ గా పరిగణించబోమన్న కోర్టు.. నిందితుడికి అరెస్టు నుంచి 8వారాలపాటు మినహాయింపు కల్పించింది. ఈ ఆదేశాలతో షాకైన బాధితురాలు... సహజీవనం చేసిన సమయంలో ఆ వ్యక్తి(నిందితుడు) దారుణంగా హింసించడమే కాకుండా గాయపరిచాడని.. అందువల్ల తాను ఆసుపత్రి పాలైనట్లు ఆరోపణలు చేసింది. తన కాలు విరిగినట్లుగా కూడా పేర్కొంది. దీనిపై జోక్యం చేసుకున్న చీఫ్ జస్టిస్.. ''మీపై దాడి జరిగి, మీరు గాయపడి ఉన్నట్లయితే దాడి కేసును దాఖలు చేయాలిగా. మరి అత్యాచారం కేసు ఎందుకు పెట్టారు?" అని ఎదురుప్రశ్నించారు. చివరికి.. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయలేమన్న కోర్టు.. తప్పుడు వాగ్ధానం ఆరోపణల్లో సాక్ష్యాధారాలు లభ్యమైన తర్వాత ట్రయల్ కోర్టులో అప్పీలు చేసుకోవాలని సూచించింది.

viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్

English summary
The Supreme Court of India on Monday once again ignited the debate surrounding consent in rape with Chief Justice of India, SA Bobde querying whether sexual intercourse between a lawfully wedded man and wife can be termed as rape. The Court was hearing the petition of a person accused of rape by a woman with whom he had been in a live-in relationship for over two years. The woman had filed an FIR for rape after he married another woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X