వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ జాకెట్ ఖరీదు: రేణుకా చౌదరి ఫక్కున నవ్వారు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాకెట్‌పై బిజెపి చేసిన విమర్శలకు కాంగ్రెసు పార్టీ నేత రేణుకా చౌదరి ఫక్కున నవ్వారు. బిజెపిని అవహేళన చేస్తూ పరిహసించారు.

సూటు - బూటు సర్కార్ అంటూ మోడీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసే రాహుల్ గాంధీ రూ. 70 వేల ఖరీదు చేసే జాకెట్ వేసుకున్నారని బిజెపి చేస్తున్న విమర్శలను ఆమె తోసిపుచ్చారు.

కావాలంటే రూ.700కే కొనిస్తా...

కావాలంటే రూ.700కే కొనిస్తా...

బిజెపి విమర్శలను వేలాకోళం చేస్తూ - ఆ జాకెట్ రూ. 70 వేలా, కావాలంటే రూ. 700లకు దొరుకుతుందని, కావాలంటే తాను ప్రధాని మోడీకి కొనిస్తానని రేణుకా చౌదరి అన్నారు. బిజెపి చేస్తున్న విమర్శలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఫక్కున నవ్వేశారు.

ఆన్‌లైన్‌లో వెతికి...

ఆన్‌లైన్‌లో వెతికి...


రాహుల్ గాంధీపై చేస్తున్న విమర్శలు బిజెపి నిస్పృహకు నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని, కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో గాలించి ఇలా రేట్లు ఊహించుకుంటున్నారని రేణుకా చౌదరి అన్నారు. ఆ జాకెట్ రూ.700కు దొరుకుతుందని, కావాలంటే తాను మోడీకి పంపిస్తానని, 56 ఇంచుల ఛాతీ అంటూ చెప్పుకునే మోడీ కొలతలు తమకు తెలియవని ఆమె అన్నారు.

రాహుల్ గాంధీ ఇలా హాజరయ్యారు...

రాహుల్ గాంధీ ఇలా హాజరయ్యారు...

షిలాంగ్‌‌లో మంగళవారం జరిగిన ఓ సంగీత కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఖరీదైన జాకెట్ ధరించి హాజరయ్యారు. దాన్ని గమనించిన బిజెపి మేఘాలయ విభాగం ట్విట్టర్‌లో విమర్శలు చేసింది. దాదాపు 70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్ ధరించారని ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ప్రజల గురించి పట్టించుకోకుండా...

ప్రజల గురించి పట్టించుకోకుండా...

మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలోని అసమర్థ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ వంత పాడుతారా అని బిజెపి ప్రశ్నించింది. రాహుల్ ప్రదర్శిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం రాహుల్ గాంధీ మేఘాలయ వెళ్లారు.

English summary
Congress leader Renuka Chowdhury on Wednesday laughed off the controversy over party president Rahul Gandhi’s jacket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X