వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌ అవమానం మర్చిపోం- ఢిల్లీ కుట్రల్ని జనంలోకి తీసుకెళ్తామన్న మెహబూబా ముఫ్తీ

|
Google Oneindia TeluguNews

చట్టవిరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్దంగా ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకున్న నిర్ణయంతో ఎదురైన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని జమ్మూ, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబాబూ ముఫ్తీ వ్యాఖ్యానించారు. ప్రజాభద్రతా చట్టం కింద ఏడాది నుంచి గృహనిర్బంధంలో ఉన్న ముఫ్తీ నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు.

గృహనిర్బంధం నుంచి బయటికొచ్చిన తర్వాత కశ్మీరీలను ఉద్దేశించి మెహబూబా ముఫ్తీ ఎంతో ఉద్వేగంగా స్పందించారు. ఢిల్లీ దర్బార్‌ మా నుంచి చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నది (ఆర్టికల్ 370) తిరిగి తీసుకోవాలి. ఇది మాత్రమే కాదు, కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది, దీని కోసం అనేక మంది కాశ్మీరీలు తమ ప్రాణాలను వదులుకున్నారు. నాకు తెలుసు మార్గం సులభం కాదు కాని మేము ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు, నన్ను విడిచిపెట్టినప్పుడు, చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉన్న ఇతరులను విడుదల చేయాలని నేను కోరుతున్నాను "అని ముఫ్తీ ప్రజలకు తన సందేశంలో పేర్కొన్నారు.

Cant Forget Insult of August 5: Mehbooba Muftis First Message to Kashmiris

గతేడాది కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ముఫ్తీని ఇతర నేతలతో పాటు నిర్బంధంలో ఉంచిన కేంద్రం.. ఆ తర్వాత దాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఫ్తీపై కఠినమైన ప్రజాభద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆమెను అధికారిక నివాసాన్నే అనుబంధ జైలుగా మార్చి మరీ నిర్బంధంలో ఉంచారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమె విడుదలయ్యారు.

English summary
former jammu and kashmir chief minister mehabooba mufti who is released from house arrest yesterday says that kashmiris never forget august 5th insult forever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X