వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. మోడీకి క్లీన్‌చిట్‌పై మరో పిటీషన్ వేయండన్న సుప్రీం..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ప్రధాని మోడీకి ఎలక్షన్ కమిషన్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై ప్రస్తుతానికి జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి మరో పిటీషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్‌కు సూచించింది. మోడీపై విపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకోవడంలేదంటూ పిటీషన్ దాఖలు చేసినందున ఆ అంశంపైనే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘనలపై ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకటించినందున కాంగ్రెస్ ఎంపీ సుష్మితాదేవ్ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.

రాజీవ్ అవినీతిపరుడన్న వ్యాఖ్యల్లో తప్పులేదు! మోడీకి మరో క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ..!రాజీవ్ అవినీతిపరుడన్న వ్యాఖ్యల్లో తప్పులేదు! మోడీకి మరో క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ..!

కాంగ్రెస్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీం

కాంగ్రెస్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీం

ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఈసీకి ప్రతిపక్షాలు పలు ఫిర్యాదులు చేశాయి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈసీ చర్యలు ప్రారంభించినందున దాన్ని కొట్టివేసింది.

మోడీకీ క్లీన్‌చిట్‌పై కాంగ్రెస్ అభ్యంతరం

మోడీకీ క్లీన్‌చిట్‌పై కాంగ్రెస్ అభ్యంతరం

ఇదిలా ఉంటే ఈసీ వైఖరిపై పిటీషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ మోడీకి వరుస క్లీన్‌చిట్‌లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు పిటీషనర్ సుష్మితాదేవ్ కోర్టుకు మరో అఫిడవిట్ సమర్పించారు. మోడీపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించలేదన్న అంశాన్ని అందులో ప్రస్తావించారు. మోడీ ఎన్నికల ప్రచారంలో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీని నెంబర్ వన్ అవినీతిపరుడంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని కాంగ్రెస్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ అంశాన్ని ప్రస్తుతం పరిశీలించలేమని ధర్మాసనం ప్రకటించింది.

మరో పిటీషన్ వేయాలని సూచన

మరో పిటీషన్ వేయాలని సూచన

కాంగ్రెస్ పిటీషన్‌ను కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం, రాజీవ్‌గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలకు ఈసీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై మరో పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో పిటీషనర్ సుష్మితాదేవ్ పిటీషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు సూచనల మేరకు ప్రధాని మోడీపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు 9 కంప్లైంట్లకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.

English summary
Supreme court cleared that it cannot go into the merits the clean chits given by the Election Commission to PM Modi and BJP chief Amit Shah. the Supreme Court on Wednesday dismissed a plea moved by Congress MP Sushmita Dev. the top court said, that because the petition filed by Dev was against the inaction of the EC in dealing with the complaints against Modi and shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X