వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒప్పో f9 ప్రో అదిరిపోయే ఫీచర్స్ : ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో రెండుగంటల టాక్ టైమ్

Google Oneindia TeluguNews

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. టచ్ స్క్రీన్‌పై ఒక వేలితో తాకితే చాలు మరో ప్రపంచంలోకి మనల్ని తీసుకెళుతుంది. అది కూడా కాకపోతే మనం ఇచ్చే వాయిస్ కమాండ్ ద్వారా టాస్క్ పూర్తి అవుతుంది. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తుండటంతో స్మార్ట్ ఫోన్లు కూడా ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా, గేమ్స్, కెమెరా, ఫోటోలు తీసుకోవడం, పాటలు వినడం, వీడియోలు చూడటంతో బ్యాటరీ ఛార్జింగ్ అనుకున్నంత స్థాయిలో రాదు. ఇక మన ఫోన్‌లో బ్యాటరీ అయిపోయిందంటే రీచార్జ్ చేసుకునేందుకు పవర్ ప్లగ్ వెతుకుతాం. ఇకపై ఆ బాధ ఉండదని చెబుతోంది ఒప్పో యాజమాన్యం.

ఒప్పో f9 ప్రొతో ఇకపై ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతోంది ఆసంస్థ. ఒప్పో f9 ప్రో ఎన్నో సవాళ్లను అధిగమించిందని ఇందులో ప్రధాన సవాలుగా ఉన్న ఛార్జింగ్‌ సమస్యకు చెక్ పెడుతూ వచ్చిందని సంస్థ తెలిపింది. ఒప్పో f9 ప్రోను ఐదు నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు ఇక రెండు గంటల పాటు హాయిగా మాట్లాడుకోవచ్చు... సినిమాలు చూడొచ్చు, పాటలు వినొచ్చు. ఇందుకోసం vooc ఫ్లాష్ టెక్నాలజీని వినియోగించారు. బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచేందుకు ఒప్పో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని యాజమాన్యం తెలిపింది. అంతేకాదు ఛార్జింగ్ వేగం కూడా సాధారణ మొబైల్ ఛార్జింగ్‌లతో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.

Can You Charge Your Phone Any Faster Than The OPPO F9 Pro?

స్వదేశీ పరిజ్ఞానంతో vooc ఫ్లాష్ టెక్నాలజీని రూపొందించారు. కేవలం బ్యాటరీ ఛార్జింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఫ్లాష్ టెక్నాలజీ ఐదుపొరల రక్షణ కవచం ఉండటంతో 3500mah సామర్థ్యం ఉన్న బ్యాటరీ వేడెక్కకుండా భద్రపరుస్తుంది. అంతేకాదు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో కూడా ఫోన్ వినియోగించొచ్చు. సాధారణ మొబైళ్లతో ఇది సాధ్యపడదు. ఫ్లాష్ టెక్నాలజీతో పాటు మొబైల్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయని డిజైన్ స్పెసిఫికేషన్స్‌తో ఒప్పో f9 ప్రో వస్తోంది.

Can You Charge Your Phone Any Faster Than The OPPO F9 Pro?

మొబైల్ వినియోగంలో భారతీయుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణంగా డిజైన్ రూపొందించారు. క్లాసీ వాటర్ డ్రాప్ స్క్రీన్ ఒప్పో f9 ప్రో హైలైట్‌గా నిలిచింది. 6.3 అంగుళాలు కలిగిన స్క్రీన్ 2340*1080 పిక్సెల్‌తో హెచ్‌డీ వ్యూ ఇస్తుంది. ఒప్పో అంటేనే కెమెరా క్వాలిటీకి పేరుగాంచింది. ఇక ఒప్పో f9 ప్రోలో వెనక వైపున డ్యూయల్ కెమరాలు ఉన్నాయి. ఒకటి 16 మెగా పిక్సెల్‌తో వస్తుండగా మరొకటి 2 మెగా పిక్సెల్‌తో వస్తోంది.

Can You Charge Your Phone Any Faster Than The OPPO F9 Pro?

ఇక ర్యామ్ విషయానికొస్తే ఒప్పో f9 ప్రో 6జీబీ ర్యామ్‌తో వస్తోంది. 64జీబీ రామ్‌తో అద్భుతంగా పనిచేస్తోంది. ఇందుకు కారణం మీడియా టెక్ హీలియో P60 ప్రాసెసర్ కావడం విశేషం. ఒప్పో f9 ప్రో మూడు రంగుల్లో మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంది. సన్‌రైజ్ రెడ్, ట్విలైట్ బ్లూ, స్టారీ పర్పులు కలర్స్‌లో వస్తోంది. ఈ డిజైన్లతో చాలా ట్రెండీగా కూడా కనిపిస్తోంది.

Can You Charge Your Phone Any Faster Than The OPPO F9 Pro?

ఒప్పో f9 ప్రో మొబైల్ ఫోను కేవలం ఒప్పో బ్రాండ్‌లోనే కాదు స్మార్ట్ ఫోన్ రంగంలోనే కొత్త పుంతలు తొక్కింది. తొలిసారిగా vooc ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో రావడం ఒప్పో f9 ప్రో మొబైల్ ఇండస్ట్రీలోనే రికార్డు క్రియేట్ చేసింది. ఆగష్టు 21న ఈ ఒప్పో f9 ప్రో ఫోను విడుదలైంది. ఇక మొబైల్ లవర్స్‌కు ఆగష్టు 31 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోను ఆన్‌లైన్ ద్వారా ఆఫ్‌లైన్ ద్వారా మార్కెట్లలో లభ్యమవుతుంది.ఒప్పో f9 ప్రోకు సంబంధించి మరిన్ని వివరాలు అప్‌డేట్స్ కోసం ఒప్పో అధికారిక ఫేస్‌బుక్ పేజ్, ఇన్స్‌టాగ్రామ్, ట్విటర్ పేజ్‌లను వీక్షించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X