• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దు "తీవ్రమైన అంశం" .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరిన సుప్రీం

|

ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోవడం వల్ల కేంద్రం దాదాపు మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడం చాలా తీవ్రమైన చర్య అని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది . ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరియు అన్ని రాష్ట్రాల నుండి వివరణ కోరింది. ఈ మేరకు బుధవారం సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఆ పని చేస్తే ప్రోత్సాహకాలు కూడా .. మరో బాంబు పేల్చిన కేంద్రంప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఆ పని చేస్తే ప్రోత్సాహకాలు కూడా .. మరో బాంబు పేల్చిన కేంద్రం

 దాదాపు మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడం చాలా తీవ్రమైన విషయం

దాదాపు మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడం చాలా తీవ్రమైన విషయం

ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బొబ్డే, న్యాయమూర్తులు ఎ.ఎస్.బోపన్న, వి.రామసుబ్రమణియన్ ధర్మాసనం ఈ విషయం చాలా తీవ్రమైన విషయం కాబట్టి దీనిని సాధారణ విషయంగా పరిగణించరాదని అన్నారు. ఈ విషయాన్ని తుది విచారణకు పెడతామని ధర్మాసనం తెలిపింది. జార్ఖండ్ కు చెందిన కోయిలి దేవి అనే మహిళ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది . కోయిలి దేవితరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వ్స్ రేషన్ రద్దు కారణంగా ఆకలి మరణాలు సంభవించటం చాలా పెద్ద సమస్య అని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

 దీనిపై మరింత విచారణ జరపాలి . సాధారణ వ్యాజ్యం కాదు

దీనిపై మరింత విచారణ జరపాలి . సాధారణ వ్యాజ్యం కాదు

ఆధార్ అనుసంధానం లేని కారణంగా కేంద్రం మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసిందని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోలిన్ తెలిపారు. అయితే ఈ వాదనను అదనపు సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. రేషన్ కార్డులు రద్దు చేశామన్న ప్రకటన తప్పని ఆయన పేర్కొన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం ఈ పిటిషన్ మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఆధార్ సమస్యలపై సమాధానం తెలియజేయాలని, ఇది సాధారణమైన వ్యాజ్యం కాదని, తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది.

రేషన్ కార్డు రద్దుతో పదకొండేళ్ళ చిన్నారి మృతి.. కోర్టును ఆశ్రయించిన తల్లి

రేషన్ కార్డు రద్దుతో పదకొండేళ్ళ చిన్నారి మృతి.. కోర్టును ఆశ్రయించిన తల్లి

ఇక కోయిలీ దేవి వేసిన కేసు విషయానికి వస్తే రేషన్ కార్డు రద్దు చేయడం వల్ల కోయిలీ దేవి పదకొండేళ్ల కుమార్తె సంతోషి 2018లో ఆకలితో అలమటించి ప్రాణాలను కోల్పోయింది. ఈ కేసులో సంతోషి సోదరి గుడియా దేవి ఉమ్మడి పిటిషనర్ గా ఉన్నారు . ఆధార్‌తో అనుసంధానం చేయడంలో విఫలమైనందున స్థానిక అధికారులు ఆమె కుటుంబానికి చెందిన రేషన్ కార్డును రద్దు చేయడంతో పేద దళిత కుటుంబానికి చెందిన సంతోషి మరణించారని పిటిషన్‌లో పేర్కొన్నారు .

2018లో పిటిషన్.. గతంలోనూ వివరణ కోరిన సుప్రీం

2018లో పిటిషన్.. గతంలోనూ వివరణ కోరిన సుప్రీం

2017 మార్చి నుంచి స్థానిక అధికారులు తమకు రేషన్ నిలిపివేశారని , తినడానికి తిండి లేని పరిస్థితుల్లో తన కుమార్తె మృతి చెందిందని కోయిలీ దేవి ఆవేదన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీనిపై 2018 నుండి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కోయిలీ దేవి పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డులు లేనందుకు వారి రేషన్ కోల్పోయిన వ్యక్తులు ఆకలితో మరణించారనే ఆరోపణలపై 2019 డిసెంబర్ 9 లో ఉన్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల నుండి స్పందన కోరింది.

గతంలో కేంద్రం వివరణ .. సమగ్ర విచారణకు సుప్రీం నిర్ణయం

గతంలో కేంద్రం వివరణ .. సమగ్ర విచారణకు సుప్రీం నిర్ణయం

ఆకలి కారణంగా మరణాలు సంభవించలేదని నివేదికలు సూచిస్తున్నాయని కేంద్రం గతంలో తెలిపింది. రేషన్ కార్డు ఆధార్ కార్డు తో అనుసంధానమై లేకపోవడం వల్ల ఎవరికీ ఆహారం ఇవ్వకుండా నిరాకరించలేదని కేంద్రం ధర్మాసనం దృష్టికి అప్పుడే తీసుకువెళ్ళింది. ఇప్పుడు మరోమారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు పేర్కొన్న సుప్రీం ధర్మాసనం దీనిపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించింది.

English summary
The Supreme Court on Wednesday termed the cancellation of around three crore ration cards by the Centre due to non-linking with Aadhaar card as "too serious", and sought response from the Central government and all states on the issue. A bench of Chief Justice SA Bobde and justices AS Bopanna and V Ramasubramanian said this matter should not be treated as adversarial as it is too serious a matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X