వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: 20వేలమందికి క్యాప్ జెమినిలో ఉద్యోగాలు

క్యాప్ జెమినిలో ఈ ఏడాది 20 వేల మందిని నియమించుకోనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.ఆటోమేషన్ ప్రభావం వల్ల ఇబ్బందులు ఏర్పడకుండా తమ ఉద్యోగులకు రీస్కిల్ చేపట్టింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: టెక్కీలకు క్యాప్ జెమిని శుభవార్త చెప్పనుంది. ఈ ఏడాది భారత్ లో 20 వేల మందికి పైగా ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని ఆ కంపెనీ యోచిస్తోంది. ఆటోమేషన్ ప్రభావ్ ఉద్యోగులపై పడకుండా ఉండేందుకుగాను ఆ సంస్థ ప్రయత్నాలను ప్రారంభించింది.

శుభవార్త: ఈ ఏడాది టెక్కీలకు భారీగా ఉద్యోగాలు, బెంగుళూర్ టాప్శుభవార్త: ఈ ఏడాది టెక్కీలకు భారీగా ఉద్యోగాలు, బెంగుళూర్ టాప్

ఈ కంపెనీ 45 వేల మందికి రిస్కిల్ చేపట్టింది. ఈ ఫ్రెంచ్ ఐటీ సర్వీస్ కన్సల్టెంట్ గత ఏడాది 33 వేల మంది ఉద్యోగులను నియమించుకొంది. 51 వేల మందికి రీస్కిల్ చేపట్టింది. తాము ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అభివృద్ది కోసం చేపడుతున్నట్టు క్యాప్ జెమిని ప్రకటించింది.

Capgemini might hire over 20,000 employees from India

తమ వర్క్ ఫోర్స్ లో ఎక్కువ అవకాశాలు ఆటోమేషన్ ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ కల్పిస్తుండడంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లలో పెట్టుబడులు పెంచినట్టు తెలిపారు. క్యాప్ జెమినికి భారత్ లో లక్ష మంది ఉద్యోగులున్నారు.

అంతర్జాతీయంగా ఎంతమందిని నియమించుకొంటుంది. ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తోందో కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆటోమేషన్ తమ ఉద్యోగులకు మరింత ఉత్పాదకతను అందిస్తోందని క్రిష్టోఫర్ చెప్పారు.

ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులకు మరింత డిమాండ్ ను కల్పించనుందనే ఈ కంపెనీ చెబుతోంది. అయితే ఆటోమేషన్ డిజిటలైజేషన్ ప్రభావంతో చాలా ఐటీ కంపెనీల నియామకాలను తగ్గించాయి.ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సైతం ఈ ఏడాది ఉద్యోగాల వృద్ది కేవలం 5 శాతం మాత్రమేనని ప్రకటించింది.

వచ్చే 3 ఏళ్ళలో ఉద్యోగాల నియామకాలు 20-25 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని అంచనావేసింది. మరోవైపు ఇన్పోసిస్ కంపెనీ కూడ 2018 ఆర్థిక సంవత్సరంలో 20 వేల మందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది.

అయితే ఆటోమేషన్ తో 11 వేల మంది పుల్ టైమ్ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు తన వార్షిక రిపోర్టులో ప్రకటించింది.

English summary
Capgemini, the French multinational information technology consulting corporation might hire over 20,000 people in India this year, having reskilled 45,000 of its employees until May, as it inches towards automation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X