వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమరానికి‘సై’అంటున్న కెప్టెన్ విజయ్ కాంత్

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎండీకే అధినేత, మాజీ శాసన సభ్యుడు కెప్టెన్ విజయ్ కాంత్ స్థానిక ఎన్నికలకు సిద్దం అయ్యామని అంటున్నారు. ప్రజల్లో చోచ్చుకు వెళ్లే విధంగా పర్యటనను సిద్దం చేసుకుంటున్నారు.

ఈనెల 25వ తేది విజయ్ కాంత్ పుట్టిన రోజు. బర్త్ డే రోజు పార్టీ బలోపేతమే లక్షంగా కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని అభిమానులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2011లో తమిళనాడు శాసన సభ ఎన్నికల సందర్బంలో ఈయన కింగ్ మేకర్ గా నిలిచారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు. తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో విభేదాలు రావడంతో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తానే సీఎం అవుతానని చెప్పారు.

రివర్స్ అయ్యింది

రివర్స్ అయ్యింది

ఎన్నికల ఫలితాలు రివర్స్ కావడంతో విజయ్ కాంత్ షాక్ తిన్నారు. సీఎం కావాలన్న ఆశతో అందరిని కాదనుకున్న విజయ్ కాంత్ ఉన్న రెండు అంకెల ఓట్ల శాతం నుంచి పాతళంలోకి నెట్టబడ్డారు.

అందరూ దూరం అయ్యారు

అందరూ దూరం అయ్యారు

విజయ్ కాంత్ వెన్నంటి ఉన్న నేతలు ఎవ్వరూ ఇప్పుడు డీఎండీకేలో లేరు. విజయ్ కాంత్ ఒంటరి అయ్యారు.

ఆత్మస్థైర్యంతో ముందుకు

ఆత్మస్థైర్యంతో ముందుకు

ఇన్నాళ్లు సమీక్షలు, సమాలోచనల పేరుతో పార్టీ కార్యాలయానికే పరిమితం అయిన విజయ్ కాంత్ ఇప్పుడు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

స్థానిక ఎన్నికలకు సై అంటున్నారు

స్థానిక ఎన్నికలకు సై అంటున్నారు

తమిళనాడులో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అభిమానులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలని విజయ్ కాంత్ పిలుపునిచ్చారు. ఆ దిశగా ముందుకు సాగేందుకు సిద్దం అయ్యారు.

నేనొక్కడినే అన్నారు

నేనొక్కడినే అన్నారు

2005 నుంచి తానొక్కడినే అంటూ పార్టీని ముందుకు నడిపించిన విజయ్ కాంత్ ఇప్పుడు పాత పంథాను అనుసరించి బలోపేతం అవుతానని ధీమాతో ఉన్నారు.

పూర్వ వైభవం వస్తుందా ?

పూర్వ వైభవం వస్తుందా ?

విజయ్ కాంత్ కు పూర్వ వైభవం వస్తుందని డీఎండీకే వర్గాలు అంటున్నాయి. ఆ విధంగా విజయ్ కాంత్ పర్యటన చేపడుతారని చెబుతున్నారు.

భార్య అండగా ఉంది కదా

భార్య అండగా ఉంది కదా

విజయ్ కాంత్ కు అండగా ఆయన భార్య ప్రేమలత పర్యటన సాగిస్తారని పార్టీ నాయకులు అంటున్నారు.

పుట్టిన రోజు ముహూర్తం

పుట్టిన రోజు ముహూర్తం

ఈనెల 25వ తేదిన విజయ్ కాంత్ పుట్టిన రోజు సందర్బంగా ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రూట్ మ్యాప్

గ్రామీణ ప్రాంతాల్లో రూట్ మ్యాప్

పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలు మొదలు పెడుతున్నామని, అందుకు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నామని డీఎండీకే వర్గాలు అంటున్నాయి.

English summary
The DMDK will face the upcoming local body elections in Tamil Nadu. Vijayakanth is looking to give a better performance in the local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X