వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు చలాన్ విధింపు!

|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవా రాష్ట్ర రాజధాని పనాజీలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు పెట్టుకోకపోతే వాళ్లకు జరిమానా విధించడం సాధారణ విషయమే. అయితే.. గోవా ట్రాఫిక్ పోలీసులు మాత్రం.. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటూ ఓ కారు డ్రైవర్‌కు జరిమానా విధించారు.

ఏక్నాథ్ అనంత్ పాల్కర్ అనే వ్యక్తి కోల్వా బీచ్ సమీపంలోని ఓ గ్రామంలో కారు నడుపుతుండగా.. ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ఎల్ హనుషికట్టి అతడిని పట్టుకుని చలానా రాశారు. హెల్మెట్ పెట్టుకోలేదనే నెపంతో మోటారు వాహన చట్టంలోని 177 సెక్షన్ కింద అతడిని బుక్ చేశారు.

Car

కాగా, ఆ సెక్షన్ ప్రకారం.. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విధించొచ్చు. అయితే... ఆ ఎస్ఐ ఏదో పొరపాటున ఆ సెక్షన్ రాసి ఉంటారని, సదరు కారు డ్రైవర్ ఏదో వేరే పొరపాటు చేసి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం.. తగిన లైసెన్సు లేకపోవడం కూడా తప్పు. పొరపాటున ఆ ఎస్ఐ హెల్మెట్ లేదని రాసి ఉంటారని తెలిపారు. కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోనందుకు జరిమానా విధించేంత మూర్ఖులు ఎవరూ పోలీసు శాఖలో ఉండరని కూడా సదరు సీనియర్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
In a faux pas, the Goa Traffic Police has issued challan to a car driver for not wearing helmet while driving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X