వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్‌కు ఆహ్వానం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష్ వర్గ్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్ మాసంలో ఈ కార్యక్రమం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో జరగనుంది.

ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించడం ఆర్ఎస్ఎస్ సంప్రదాయంగా పాటిస్తోంది. ఇందులో భాగంగానే జూన్ మాసంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

Career Congman Pranab Mukherjee to be RSS Chief Guest at Nagpur Event

ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ఆలిండియా ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని హమీ ఇచ్చారని ఆయన చెప్పారు.

అయితే ఈ కార్యక్రమంలోపాల్గొనేందుకు ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన పర్యటన వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ మూడవ వార్షిక సమావేశం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

అయితే జూన్ 7వ తేదిన నాగ్‌పూర్ లో జరిగే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందినమాట వాస్తవమేనని ప్రణబ్ ముఖర్జీ కార్యాలయవ ర్గాలు చెబుతున్నారు. అయితే ఆయన నాగ్‌పూర్‌లో జరిగే కార్యక్రమానికి హజరౌతారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యక్రమంలో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తికి కారణం కావొచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. స్వాతంత్ర్యపోరాటం నుండి ఆర్ఎస్ఎస్ తో కాంగ్రెస్ పార్టీకి మధ్య సిద్దాంతరీత్యా విబేధాలు సాగుతున్నాయి.రాష్ట్రపతిగా ప్రణబ్ కొనసాగిన సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భగవత్ ను భోజనానికి కూడ ఆహ్వానించారు.

English summary
Former president Pranab Mukherjee will be the chief guest at the valedictory session of the ‘Tritiya Varsh Varg’ or the Third Year Course organised by the Rashtriya Swayamsewak Sangh (RSS) in June this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X