వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద నీటిలోనే అంతిమ యాత్ర.. అంత్యక్రియలకు ఎన్ని కష్టాలో (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

వరద నీటిలోనే అంతిమ యాత్ర.. అంత్యక్రియలకు ఎన్ని కష్టాలో (వీడియో)

భోపాల్ : వరదల కారణంగా చివరి మజిలీ కష్టంగా మారింది. అంతిమ యాత్రను నీటి కష్టాలు వెంటాడినట్లైంది. చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు వరద రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాల కారణంగా అంతిమ యాత్రలో ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో అయ్యో అంటూ తమ బాధను, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

కుండపోత వర్షాలు మధ్యప్రదేశ్ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తడంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో మంద్సార్ జిల్లా నౌగాన్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

నౌగాన్ గ్రామానికి చెందిన ఓ మహిళ చనిపోవడంతో గ్రామస్తులు, బంధువులు కలిసి అంత్యక్రియలకు అంతా సిద్ధం చేశారు. అయితే ఊరి శివారులో దహన సంస్కారాలు చేయాల్సి ఉండటంతో కొద్ది దూరం అంతిమ యాత్ర నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఓ నాలా మీదుగా అక్కడకు వెళ్లాల్సి ఉంది. వరదల కారణంగా ఆ నాలా పైనుంచి ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. అయినా కూడా వేరే దారి లేక చివరకు ఆ నాలా మీదుగా అంతిమ యాత్ర కొనసాగించారు.

మురికి నీరు రోడ్డు పైకి.. మున్సిపల్ అధికారుల భారీ జరిమానా..!మురికి నీరు రోడ్డు పైకి.. మున్సిపల్ అధికారుల భారీ జరిమానా..!

Carry Dead Body For Last Rites in flood water Tragic Video

నాలాపై బ్రిడ్జి నిర్మించాలని కొన్నాళ్లుగా అధికారుల చుట్టూ తిరిగి ప్రాధేయపడుతున్నా.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. నౌగాన్ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, సమీప పట్టణాలకు వెళ్లాలన్నా ఇదే నాలా మీది నుంచి వెళ్లాల్సి వస్తోంది. అయితే వర్షాకాలంలో ఈ గ్రామస్తులకు ఇలాంటి బాధలు తప్పడం లేదు. బ్రిడ్జి నిర్మించాలని అధికారులను పదేపదే కోరుతున్నా.. వారి నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

English summary
Madhya Pradesh Residents of Naugaon village in Mandsaur district carry the dead body of a woman through a flooded nallah, for her last rites. Villagers say that though they had requested the administration multiple times for a bridge, their requests were never heard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X