వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cartosat 3: నింగిలోకి కార్టోశాట్-3 ..అమెరికా నుంచి ప్రయోగించనున్న ఇస్రో

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమవడంతో నిరుత్సాహ పడని భారత అంతరిక్షపరిశోధన సంస్థ రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3ని నింగిలోకి పంపనుంది ఇస్రో. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగిస్తున్న ఈ కార్టోశాట్-3 ఉపగ్రహం భారత్ నుంచి కాకుండా అమెరికా నుంచి ప్రయోగం నిర్వహించనుంది.

చంద్రయాన్ -3: వచ్చే నవంబర్‌లో చంద్రయాన్ -3,సాఫ్ట్ ల్యాండింగే లక్ష్యంచంద్రయాన్ -3: వచ్చే నవంబర్‌లో చంద్రయాన్ -3,సాఫ్ట్ ల్యాండింగే లక్ష్యం

ఇస్రో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనున్న పోలార్ శాటిలైల్ లాంచ్ వెహికల్-ఎక్స్‌ఎల్... కార్టోశాట్-3తో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను నవంబర్ 25 అమెరికాలోని లాంచ్‌ ప్యాడ్ నుంచి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. భారత కాలమాన ప్రకారం రాకెట్ ఉదయం 9గంటల 28 నిమిషాలకు టేకాఫ్ తీసుకోనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

Cartosat 3: ISRO to launch Cartosat-3 and 13 nano satellites from US on November 25th

కార్టోశాట్ -3 ఉపగ్రహం మూడో తరంకు చెందిన అడ్వాన్స్‌డ్‌ శాటిలైట్. హై రిజల్యూషన్ ఇమేజింగ్ దీని సొంతం. అంటే ఫోటోలు అత్యంత స్పష్టంగా తీస్తుంది. అంతకుముందు ప్రయోగించిన కార్టోశాట్లలో ఈ స్థాయి రిజల్యూషన్ లేదు. ఉగ్రవాదుల కార్యకలాపాలు వారి శిబిరాలను కనుగొనేందుకు కార్టోశాట్-3 ఉపయోగపడుతుంది. మిలటరీ నిఘా కార్యక్రమాలకు ఈ ఉపగ్రహం ఎక్కువగా దోహదపడుతుంది.

కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇక ఇస్రో చెబుతున్న ప్రకారం అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు. ఇవి పూర్తిగా వాణిజ్య అవసరాలకోసం రూపొందించిన శాటిలైట్లు. స్పేస్ డిపార్ట్‌మెంట్ కింద కొత్తగా ఏర్పడిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ నానో శాటిలైట్లను రూపొందించింది.

English summary
India will launch its cartography satellite Cartosat-3 and 13 commercial nanosatellites into sun-synchronous orbit on November 25, the Indian space agency said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X