• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాప్‌లెస్‌గా శబరిమల ఉద్యమకారిణి: ఆమె అర్ధనగ్న శరీరంపై పెయింట్ వేసిన కొడుకు, కుమార్తె

|

తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్ర శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇదివరకు ఉద్యమాన్ని నడిపించిన కేరళ సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమా మరో సంచలనానికి తెర తీశారు. తన అర్ధనగ్న శరీరంపై కుమారుడు, కుమార్తెతో బాడీ పెయింట్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా తయారైంది. ఈ ఘటనపై మలయాళీలు మండిపడుతున్నారు. ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు చట్టాల కింద ఆమెపై పోలీసులు కేసు నమెదు చేశారు.

ఈ లెక్కన మీ ప్రతిపక్ష హోదా పోయినట్టేగదయ్యా .. సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి

శబరిమల ఆలయ ఉద్యమంతో..

శబరిమల ఆలయ ఉద్యమంతో..

శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రెహానా ఫాతిమా ఇదివరకు ఉద్యమించారు. అయ్యప్పమాలను ధరించి స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసిన తరువాత.. ఆ ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై విచారణ కొనసాగుతోన్న సమయంలో రెహానా ఫాతిమా పలుమార్లు అయ్యప్పస్వామి సన్నిధికి చేరుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె అరెస్టు అయ్యారు. ఈ ఉద్యమంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు.

కొడుకు, కుమార్తెతో బాడీ పెయింటింగ్..

కొడుకు, కుమార్తెతో బాడీ పెయింటింగ్..

తాజాగా- మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. వార్తల్లోకి ఎక్కారు. రెహానా ఫాతిమాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. పదేళ్ల లోపు వయస్సున్న కుమారుడు, 12 సంవత్సరాల వయస్సున్న కుమార్తెతో రెహానా ఫాతిమా బాడీ ఆర్ట్ వేయించుకున్నారు. టాప్‌లెస్‌గా ఉన్న ఆమె శరీరంపై ఆమె కొడుకు, కూతురు పెయింట్ వేస్తోన్న దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 19 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో కేరళలో దుమారం రేపుతోంది.

 నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్..

నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్..

బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ పేరుతో యూట్యూబ్ లో ఆమె పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ వీడియోను చూసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ అరుణ్ ప్రకాశ్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు తిరువళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్‌ల కింద కేసు నమోదైంది. రెహానా ఫాతిమాకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసినట్లు తిరువళ్ల డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రాజప్పన్ తెలిపారు. ఈ కేసును సైబర్ సెల్‌కు బదలాయించినట్లు చెప్పారు.

మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా..

మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా..

శబరిమలలో మహిళల ప్రవేశాన్ని కల్పిస్తూ ఉద్యమించిన సమయంలో ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. మత విధ్వేషాలను రెచ్చగొడుతున్నారనే కారణంతో ఆమెపై కేసులు పెట్టారు. ఆ సమయంలో ఆమె ఇంటిపైనా మలయాళీలు రాళ్లతో దాడి చేశారు. కుటుంబ సభ్యులు సైతం ఆమెను వెలి వేశారు. బిందు, కనకదుర్గలతో కలిసి రెహానా ఫాతిమా శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. గత ఏడాది జనవరి 1న తాము అయ్యప్పను దర్శించుకున్నట్లూ వారు ప్రకటించుకున్నారు. తాజాగా మళ్లీ ఆమె కేసులను ఎదుర్కొంటున్నారు.

English summary
A police case has been charged against activist Rehana Fathima after a video was circulated in social media in which her children are seen painting on her naked body. Thiruvalla police took action on the basis of a complaint filed by OBC Morcha state general secretary Adv A V Arun Prakash. Non-bailable offences have been charged as per IT Act and Juvenile Justice Act. Thiruvalla DYSP T Rajappan said that they will take further action with the help of Cyber Cell.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more